YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 3 June 2012

జనం మధ్య జగన్ ఉంటే ఎందుకంత భయం?

గుంటూరు, న్యూస్‌లైన్ ప్రతినిధి: ప్రజల మధ్య జగన్ ఉంటే కాంగ్రెస్, టీడీపీలకు ఎందుకంత భయమని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల ప్రశ్నిం చారు. జగన్ జనం మధ్య ఉంటే ఉప ఎన్నికల్లో తమకు డిపాజిట్లు కూడా దక్కవన్న నీచ రాజకీయాలతో ఆ రెండు పార్టీలు కుట్రపన్ని సీబీఐ సాయంతో ఆయనను జైల్లో పెట్టించాయన్నారు. రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే వైఎస్సార్ కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఆదివారం గుంటూరు జిల్లాలో తల్లి విజయమ్మతో కలిసి ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పలుచోట్ల ప్రసంగిస్తూ.. కాంగ్రెస్, టీడీపీలు చేస్తున్న కుట్రలను ఎండగట్టారు. సీబీఐ స్వతంత్ర దర్యాప్తు సంస్థలా కాకుండా కేంద్ర హోంశాఖ కమిషనరేట్‌గా మారిపోయిందని, ప్రభుత్వం ఎలా ఆడమంటే అలా ఆడుతోందని చెప్పారు. 

ఈ విషయా న్ని సీబీఐ మాజీ డెరైక్టరే బయటపెట్టినట్లు గుర్తు చేశారు. దివంగత వైఎస్సార్‌ను అప్రదిష్ట చేయడమే లక్ష్యంగా సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోందన్నారు. వైఎస్ కుటుంబానికి అన్యాయం చేసి ఏడిపించి, కాంగ్రెస్, టీడీపీలు నవ్వుకుంటున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘వైఎస్ లేరని, తిరిగి రారని ఆయనను మీ ముం దు దోషిగా నిలిపే నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు.జగన్ అన్నను ఎందుకు అరెస్టు చేశారు. ఏ తప్పు చేశారంటే సీబీఐ వద్ద సమాధానాలు లేవు. సమాధానమే కాదు.. వారి వద్ద ఆధారాలు కూడా లేవు. ఉప ఎన్నికల ప్రచార సమయంలో జనం మధ్య లేకుండా చేసేందుకే జగన్‌ను అరెస్టు చేశారు. హెలికాప్టర్‌ను కూల్చి, మంచి మనిషిని జైలుకు పంపటమేనా రాజకీయమంటే..’’అని నిలదీశారు. జగనన్నకు జరిగిన అన్యాయానికి ఓటుతో సమాధానం చెప్పాలని ప్రజలను కోరారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!