YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 18 June 2012

ఉప ఎన్నికల్లో సానుభూతి కాదు.. జగన్ నాయకత్వానికి జనం పట్టం

- ఆ ఆరోపణల్లో వేటికీ ఆధారాల్లేవు 
- త్వరలోనే నిర్దోషులుగా బయటపడతాం : విజయసాయిరెడ్డి 
- నార్కో అనాలసిస్ పరీక్షలు అమానవీయమైనవి
- జగన్ విచారణ, అరెస్టులో సీబీఐ పక్షపాతంగా వ్యవహరించింది
- ఉప ఎన్నికల్లో సానుభూతి కాదు.. జగన్ నాయకత్వానికి జనం పట్టం కట్టారు 

తిరుపతి, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన శ్రేయోభిలాషుల మీద కక్ష సాధింపు కోసమే కేసులు బనాయించారని, ఆ ఆరోపణలకు ఏ మాత్రం ఆధారాలు లేవని ప్రముఖ ఆడిటర్ వి. విజయ సాయిరెడ్డి చెప్పా రు. ఈ కేసుల నుంచి తామంతా నిర్దోషులుగా అతి త్వరలోనే బయటకొస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సోమవారం తిరుమల, తిరుచానూరులలో తన కుటుంబ సభ్యులతో కలిసి విజయసాయిరెడ్డి దైవ దర్శనం చేసుకున్నారు. అనంతరం తిరుపతిలో తనను కలసిన విలేకరులతో మాట్లాడారు.నార్కోఅనాలసిస్, బ్రెయిన్ మ్యాపింగ్, లై డిటెక్టర్ లాంటి పరీక్షలు అమానవీయమైనవనీ, మనిషిని మగతలో ఉంచి చెప్పించిన విషయాలను కోర్టులు సాక్ష్యంగా పరిగణించలేవని పేర్కొన్నారు. 

ఈ తరహా పరీక్షలు చట్ట సమ్మతం కాదని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసిందన్నారు. తన విషయంలోనే ఈ పరీక్షలను కోర్టు తిరస్కరించినా, సీబీఐ మళ్లీ జగన్‌కు ఈ పరీక్షలు నిర్వహించాలని కోర్టును ఆశ్రయించడం దురుద్దేశంగాక మరేమవుతుందని ఆయన ప్రశ్నించారు. కోర్టు ఆదేశం మేరకు జరుగుతున్న సీబీఐ విచారణను తాము తప్పుపట్టడం లేదని, విచారణ జరుగుతున్న తీరు, అది పయనిస్తున్న మార్గాన్నే ప్రశ్నిస్తున్నామన్నారు.

జగన్‌ను అరెస్టు చేయడానికే ఆ అరెస్టులు..
విదేశాల నుంచి మన దేశానికి ప్రతి ఏటా లక్షల కోట్ల పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) వస్తూ పోతుంటాయని, జగన్‌కు సంబంధించిన సంస్థలకు కూడా ఇదేవిధంగా పెట్టుబడులు వచ్చాయని విజయ సాయిరెడ్డి తెలిపారు. వీటికి సంబంధించి జరిగిన ప్రతి రూపా యి లావాదేవీ రిజర్వ్ బ్యాంక్, ఇతర ప్రభుత్వ సంస్థల అనుమతితోనే సాగిందన్నారు. తమమీద ఆరోపణలు చేస్తున్న కాంగ్రె స్, టీడీపీ నాయకులు.. వారి మీద ఇలాంటి అభియోగాలు వస్తే మాత్రం విచారణ జరపరాదని కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారన్నారు.

జగన్ అరెస్టుకు ముందు జరిగిన అరెస్టులన్నీ సక్రమంగా జరిగినవి కావని, అవి జగన్‌ను అరెస్టు చేయడానికే జరిగాయని చెప్పారు. వైఎస్ జగన్‌ను అరెస్టు చేసిన సమయం, ఆయన్ను విచారించిన విధానంలో కూడా పక్షపాతం స్పష్టంగా కనిపించిందన్నారు. జగన్‌ను అరెస్టు చేసిన రోజు జరి పిన విచారణలో తాను కూడా మధ్యాహ్నం దాకా అక్కడే ఉన్నానని, ఆయన విచారణకు సహకరించలేదని సీబీఐ చేస్తున్న వాదన అవాస్తవమన్నారు. సీబీఐ చెప్పిందంతా తాము అంగీకరించడమే వారుకోరుకునే సహకారమా? అని సాయిరెడ్డి ప్రశ్నిం చారు. జగన్‌ను సీబీఐ ప్రశ్నించిన సమయంలో తీసిన వీడియోను కోర్టుకు సమర్పిస్తే ఆయన విచారణకు సహకరించారా? లేదా? అనేది తేలుతుందన్నారు.

2009 నుంచీ జగన్ ఎంపీ అని సీబీఐకి తెలియదా?
జగన్‌ఎంపీగా, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నందువల్ల సాక్షులను ప్రభావితం చేస్తారని, సాక్ష్యాలను తారుమారు చేస్తారని చెబుతున్న సీబీఐకి జగన్ 2009 నుంచి ఎంపీగా ఉన్న విషయం తెలి యదా? అని సాయిరెడ్డి నిలదీశారు. ఈడీ లేదా ఇతర ఏ దర్యాప్తు సంస్థలు ఎంతలోతుగా దర్యాప్తు చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే ఆ దర్యాప్తు నిష్పక్షపాతంగా, ఎవరి ప్రయోజనాల కోసమో కాకుండా జరగాలన్నదే తమ డిమాండ్ అని సాయిరెడ్డి చెప్పారు. 

ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సృష్టించిన తుపాను జగన్‌మీద సానుభూతితో వచ్చింది కాదని, ఆయన నాయకత్వం, విశ్వసనీయత పట్ల ప్రజలకు ఉన్న నమ్మకాన్ని రుజువు చేసిందని అన్నారు. సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఇవే ఫలితాలు వ స్తాయన్నారు. తన రాజకీయ ప్రవేశం భగవంతుడు నిర్ణయిస్తాడన్నారు. అయితే ఏదైనా జగన్ చెప్పినట్లే చేస్తానన్నారు. 30 ఏళ్లు ఆడిటర్ వృత్తిలో ఉన్న తనకు ప్రజా జీవితంలోకి వచ్చి వారికి సేవ చేయాలనే కోరిక మాత్రం ఉందన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!