హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో చేపట్టనున్న ఫీజు దీక్షలో మార్పు చోటు చేసుకుంది. 12, 13 తేదీలకు బదులుగా 13, 14 తేదీల్లో విజయమ్మ దీక్ష చేపడతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. 12వ తేదీన గ్రూప్-4 పరీక్షలు ఉన్నందున ఫీజు దీక్ష 13న ప్రారంభమవుతుందని చెప్పారు.
Thursday, 9 August 2012
వాన్ పిక్ భూములలో చంద్రబాబు పాదయాత్ర ఎందుకో?
వాన్ పిక్ భూములను తిరిగి రైతులకు అప్పగించాలని కోరుతూ టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేపడుతున్నారు. వాన్ పిక్ భూముల వ్యవహారంలో టిడిపి చేస్తున్న ఆందోళన సరైనదేనా అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుంది.వాన్ పిక్ భూముల కేటాయింపు, సేకరణ వంటి అంశాలపై సిబిఐ చేస్తున్న వాదనే అధ్వాన్నంగా ఉందనుకుంటే తెలుగుదేశం పార్టీ చేస్తున్న పాదయాత్ర వారికి ఎంతవకు రాజకీయంగా ఉపయోగపడుతుందన్నది ప్రశ్నగా ఉంది. ఈ భూములలో అత్యధికం ఎందుకు కొరగాని భూములు.ఇందులో ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టలేదు.రస్ అల్ ఖైమా పక్షాన వాన్ పిక్ సంస్థ డబ్బులు వెచ్చించి బూములు కొనుగులు చేశారు.విశేషం ఏమిటంటే వాన్ పిక్ భూ సేకరణ సమయంలో టిడిపి నాయకులు ఎవరూ పెద్దగా అభ్యంతరాలు చెప్పిన దాఖలాలు లేవు.గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు వాన్ పిక్ అతిధి గృహంలోనే బస చేశారని చెబుతారు.గత ఉప ఎన్నికల సమయంలో మంత్రి డొక్కా మాణిక్ వర ప్రసాద్ వాన్ పిక్ బూములు దున్నుతున్నానంటూ షో చేయడం కూడా విమర్శలకు దారి తీసింది. అయితే ఇప్పుడు ఆయన ను ఇన్ ఛార్జీ మంత్రిగా ఏ జిల్లాకు నియమించకపోవడానికి డొక్కా అతి ప్రవర్తన కూడా కారణమని అంటున్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల ఒక ప్రకటన చేసింది. ఇది ప్రభుత్వానికి,ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం కనుక దీనిని రద్దు చేయడం కుదరదని ప్రకటించింది.పైగా 23వేల ఎకరాలు సేకరించాలని బావించినా ఇప్పటివరకు సేకరించింది పదమూడు వేల ఎకరాలే. ప్రభుత్వపరంగా ఉన్న భూమిని ఇంతవరకు అంద చేయలేదు. ఒక ఓడరేవు, విమానాశ్రయం, విద్యుత్ తదితర ప్రాజెక్టులతో అరవై వేల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కొన్ని రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగడం చిత్రంగానే ఉంది. వీరు ప్రచారం కోసమే ఇలా చేస్తున్నారన్న అబిప్రాయం ఉంది. గత ఉప ఎన్నికలలో వాన్ పిక్ పరిది ఉన్న ఒంగోలు నియోజకవర్గంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ది బాలినేని శ్రీనివాసరెడ్డి బారీ మెజార్టీతో గెలుపొందారు.చంద్రబాబు అక్కడ పరిశ్రమలు రావద్దని చెబుతారా?లేక అసలు భూమి సేకరణే చేయవద్దంటారా? భూములు అమ్ముకున్నవారికి తిరిగి భూములు ఇవ్వడం జరుగుతుందా?కేవలం రాజకీయాల కోసం చంద్రబాబు వంటి సీనియర్ నాయకుడు ఇలాంటి ఆందోళనకు దిగడం వల్ల ఆయనకు కలిగే ప్రయోజనం ఎలా ఉన్నా రాజకీయంగా విమర్శలకు గురికాక తప్పదు.చంద్రబాబు హయాంలో కూడా ఆయా ప్రాజెక్టులకు వేల ఎకరాలు ఎకరాలు సేకరించిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా తప్పేనని చంద్రబాబు భావిస్తారా?ఏది ఏమైనా రాష్ట్రంలో పారిశ్రామికరణకు ఇలాంటి చర్యలన్ని విఘాతం కలిగిస్తాయి. ఇలా పాదయాత్రలు చేసిన సందర్భంలో వాస్తవాలు తెలుసుకుని , ప్రాక్టికల్ గా ఏది మంచిదో సలహా ఇవ్వడానికి చంద్రబాబు సిద్దమైతే మంచిదే.అలా చేస్తారా?
జగన్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీబీఐకి నోటీసులు
న్యూఢిల్లీ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం సీబీఐకి నోటీసులు జారీచేసింది. కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. అలాగే జగన్ బెయిల్ పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. పది రోజుల క్రితం సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్‌లు దాఖలు చేశారు. అయితే తన అరెస్ట్ అక్రమమంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.
Wednesday, 8 August 2012
తీవ్ర ప్రజా వ్యతిరేకత దృష్ట్యా రిజిస్ట్రేషన్ ఫీజుల పెంపు ఉత్తర్వు అమలుపై ప్రభుత్వం వెనకడుగు
- {పజలపై భారం తగ్గించాల్సిందే
- సీఎంకు మంత్రి తోట విజ్ఞప్తి
- {పజా వ్యతిరేకతతోనే వెనకడుగు
హైదరాబాద్, న్యూస్‌లైన్: తీవ్ర ప్రజా వ్యతిరేకత దృష్ట్యా రిజిస్ట్రేషన్ ఫీజుల పెంపు ఉత్తర్వు అమలుపై ప్రభుత్వం వెనకడుగువేసింది. అన్ని రకాల రిజిస్ట్రేషన్ ఫీజులను భారీగా పెంచుతూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ గత నెల 25న జారీ చేసిన జీవో-476ను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, మీడియా నుంచే కాకుండా సబ్‌రిజిస్ట్రార్ల అసోసియేషన్ నుంచి కూడా రిజిస్ట్రేషన్ ఫీజుల పెంపుపై తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో జీవో-476 అమలుపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. వివిధ వర్గాల ప్రజలనుంచి వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకుని అన్ని రకాల రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గించాల్సిన అవసరం ఉందంటూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి తోట నరసింహం స్వయంగా ముఖ్యమంత్రికి సిఫార్సు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
‘భారీగా పెంచిన అన్ని రకాల రిజిస్ట్రేషన్ ఫీజులపై పునస్సమీక్షించి ప్రజలకు భారంకానిరీతిలో తగ్గించాల్సి ఉంది. అప్పటివరకూ జీవో-476ను తాత్కాలికంగా నిలిపివేయాలి (అబయెన్స్‌లో పెట్టాలి)’ అని మంత్రి సిఫార్సు చేశారు. పెంచిన రిజిస్ట్రేషన్ ఫీజుల తగ్గింపుపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ అమలును నిలిపివేసినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్య కార్యదర్శి దినేష్‌కుమార్ తాజాగా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రెండోసారి అబయెన్స్..
జీవో-476ను అబయెన్స్‌లో పెట్టడం ఇది రెండోసారి కావడం గమనార్హం. వాస్తవంగా సంబంధిత మంత్రి తోట నరసింహం అంగీకారం లేకుండానే ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ), దస్తావేజు నకళ్లు జారీ, వివాహ రిజిస్ట్రేషన్, సేల్‌డీడ్, గిఫ్ట్ డీడ్ తదితర అన్ని రిజిస్ట్రేషన్ ఫీజులను 40 నుంచి 50 రెట్ల వరకూ పెంచుతూ అప్పటి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.సాహు గత నెల 25న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మంత్రి ఆదేశాలమేరకు ఆగస్టు పదో తేదీ వరకూ జీవో అమలును తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు గతనెల 30న ఉత్తర్వులిచ్చారు. ఇప్పటికీ దీనిపై నిర్ణయం తీసుకోనందున మళ్లీ ఈ జీవోను అబయెన్స్‌లో పెట్టాలని మంత్రి ప్రస్తుతం ముఖ్య కార్యదర్శి దినేష్‌కుమార్‌కు సిఫార్సు చేశారు. దీంతో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఈ జీవో అమలును నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
జీవోను రద్దు చేయాలి..
జీవో-476ను రద్దుచేసి ప్రజలకు భారంకాని రీతిలో రిజిస్ట్రేషన్ ఫీజులను నిర్ధారించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్య కార్యదర్శి దినేష్‌కుమార్‌కు సబ్ రిజిస్ట్రార్ల అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఈ శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన దినేష్‌కుమార్‌ను అసోసియేషన్ ప్రతినిధులు కలిసి వాస్తవ పరిస్థితులను వివరించారు. వారి సూచనలపై ఆయన సానుకూలంగా స్పందించారు.

ప్రభుత్వ పన్నాగం బయటపడింది: జూపూడి
|
బాదుడుకు బ్రేక్!
రూ. 31వేల రీయింబర్స్‌మెంట్ పరిమితిపై పునరాలోచనలో ప్రభుత్వం
రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువె త్తుతున్న నిరసనలతో నష్ట నివారణపై దృష్టి
సొంత పార్టీ, ప్రతిపక్షాలతో పాటు మంత్రులూ వ్యతిరేకిస్తున్న ఫలితం
అందరికీ పూర్తిగా ఫీజులు ఇవ్వాలంటున్న బీసీ మంత్రులు
నేటి ఉపసంఘం భేటీ తర్వాతే నిర్ణయం ?
హైదరాబాద్, న్యూస్‌లైన్ :ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి పరిమితులపై సర్వత్రా ఇంటా బయటా తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఒకడుగు వెనక్కు తగ్గింది. సొంత పార్టీతో పాటు మంత్రివర్గ సహచరులు కూడా తీవ్రంగా వ్యతిరేకించడం, రాష్ట్రవ్యాప్తంగా పార్టీలు, కుల, విద్యార్థి సంఘాలు మండిపడ్డ నేపథ్యంలో నష్ట నివారణ చర్యలకు దిగింది. వృత్తి విద్యా కోర్సుల్లో బీసీ, ఈబీసీలకు కూడా యథావిధిగా మొత్తం ఫీజును రీయింబర్స్ చేసే దిశగా కసరత్తు చేస్తోంది. కాలేజీలు సహకరిస్తే భారం తగ్గుతుందని భావిస్తోంది. వాటిని నయానో భయానో ఒప్పించి ఈ ఏడాదికి గట్టెక్కని పక్షంలో ఎన్నికల తరుణంలో అభాసుపాలు కాక తప్పదని ఆందోళన చెందుతోంది. మరోవైపు కౌన్సెలింగ్‌లో జరుగుతున్న తీవ్ర జాప్యం లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నింపుతోంది. ఇది అంతిమంగా తమకెక్కడచేటు చేస్తుందోనన్న భావనతో కూడా ప్రభుత్వం ఒక అడుగు వెనక్కు వేసినట్టు కనిపిస్తోంది. ఈ సమస్యపై విపక్షాలు ఆందోళనకు దిగడం, పరిష్కారం కోసం రెండు రోజులు దీక్ష చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా ప్రకటించడం తెలిసిందే.
భారం తగ్గేదిలా..
కామన్ ఫీజు నేపథ్యంలో ఫీజుల పెరుగుదల వల్ల ప్రభుత్వంపై ఈ ఏడాది రూ. 486 కోట్ల భారం పడుతుందని అంచనా. కానీ ఫీజుల పెంపు ప్రతిపాదనలివ్వని 550 ఇంజనీరింగ్ కాలేజీలు ఇప్పటిదాకా ఇస్తున్న రూ.31 వేల ఫీజుకే సరేననగా, ప్రతిపాదనలిచ్చిన 133 కాలేజీల్లో కూడా 100కు పైగా కాలేజీలు తమకు ఫీజును కాస్త పెంచితే చాలన్న అభిప్రాయానికి వచ్చాయి. దాంతో ఇక పడే భారం నామమాత్రంగానే ఉంటుందని, కాబట్టి ఈ ఏడాదికి ఎలాగోలా గట్టెక్కాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందరికీ ఫీజును రీయింబర్స్ చేసే యోచనకు గురువారం తుది రూపం ఇవ్వనుంది. అయితే కాలేజీలన్నీ ఏకాభిప్రాయానికి రాకుండా మీనమేషాలు లెక్కిస్తున్నాయని భావిస్తున్న సర్కారు.. టాస్క్‌ఫోర్స్‌ను రంగంలోకి దించడం ద్వారా వాటిని నయానోభయానో ఒప్పించే ప్రయత్నాల్లో పడింది. అందులో భాగంగా అంధ్రప్రదేశ్ విద్యాచట్టం (1982)లో అనుబంధ కాలేజీలు అనే పదాన్ని కూడా చేరుస్తూ చట్ట సవరణకు ఆర్డినెన్స్ తేనున్నారు. సంబంధిత ఫైలును ఆగమేఘాలపై సిద్ధం చేసి గురువారం రాత్రికల్లా రాజ్‌భవన్‌కు పంపే పనిలో ఉన్నత విద్యాశాఖ అధికారులు తలమునకలుగా ఉన్నారు.
బీసీ మంత్రుల ఒత్తిడి..
రీయింబర్స్‌మెంట్‌పై పరిమితులు తగవంటూ బీసీ మంత్రులు కూడా సీఎంపై, మంత్రివర్గ ఉప సంఘంపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్టు చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీసీ, ఈబీసీలకు రీయింబర్స్‌మెంట్‌లో కోత విధించడం సరి కాదని, పార్టీలన్నీ దీన్ని అస్త్రంగా మలచుకుంటాయని తీవ్రంగా వాదించినట్టు తెలిసింది. ‘‘ఫీజుల పెంపునకు అధికారులు సరైన ప్రాతిపదిక కూడా చూపలేకపోతున్నారు. ప్రమాణాలు పాటించని కాలేజీలపై చర్యలు తీసుకునే మార్గాలు చూడాల్సింది పోయి రీయింబర్స్‌మెంట్‌లో కోత విధించడమేమిటి? కామన్ ఫీజుకు సరైన ప్రాతిపదిక వెదికితే భారం తగ్గుతుంది’’ అంటూ వారు చేసిన సూచనలు కూడా పని చేశాయంటున్నారు.
షెడ్యూలు నేటికైనా తేలేనా?
కౌన్సెలింగ్ షెడ్యూలు ప్రకటనను గురువారానికి ఉపసంఘం వాయిదా వేసింది. న్యాయపరమైన లొసుగులే కారణమని మంత్రి చెప్పినా.. రీయింబర్స్‌మెంట్ పరిమితిపై పునరాలోచన, కామన్ ఫీజు తగ్గింపు దిశగా కాలేజీలతో చర్చలు సాగుతుండటమే ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. కాబట్టి గురువారం కూడా కౌన్సెలింగ్ షెడ్యూలు వెలువడేలా కన్పించడం లేదు. ఒకవేళ ప్రకటిస్తే శుక్రవారం నోటిఫికేషన్, 19 నుంచి సర్టిఫికెట్ల తనిఖీ ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. కాలేజీలన్నీ ఏకాభిప్రాయానికి రానందున ఇప్పటిదాకా అవి హామీ పత్రం కూడా ఇవ్వలేదని సమాచారం.
ఏ విద్యార్థీ నిరాశపడొద్దు: పితాని
కౌన్సెలింగ్ షెడ్యూలు సిద్ధంగా ఉందని, అయితే కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నందున అడ్వకేట్ జనరల్‌తో చర్చించాక దాన్ని గురువారం ప్రకటిస్తామని సాంఘిక సంక్షేమ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. ఫీజుల వ్యవహారం, కౌన్సెలింగ్ షెడ్యూలు ఖరారుపై బుధవారం మంత్రివర్గ ఉపసంఘం భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కామన్ ఫీజుపై పలు శాఖల కార్యదర్శుల సూచనలను కమిటీ పరిశీలించింది. న్యాయపరమైన లొసుగులపై ఏజీతో చర్చించాలని చెప్పాం. గురువారం మధ్యాహ్నానికల్లా వారి తుది పరిశీలన అవుతుంది. సాయంత్రం ఉపసంఘం మరోసారి భేటీ అవుతంది. కౌన్సెలింగ్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి చైర్మన్ మాకు సమర్పించారు. గురువారం తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని వివరించారు. రూ.31 వేల దాకా మాత్రమే ఫీజును రీయింబర్స్ చేస్తామంటూ ఆగస్టు 6న చేసిన కట్టుబడి ఉన్నారా అని ప్రశ్నించగా, చర్చలింకా సాగుతున్నాయని, తుది దశకు రాలేదని పితాని బదులిచ్చారు. ‘‘రూ.31 వేలే ఇస్తామని మేం చెప్పింది ఉప సంఘం చర్చల సారాంశాన్ని మాత్రమే. పార్టీలు, సంఘాలు, మేధావులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయ మిత్రుల సూచనల మేరకు.. ఏ విద్యార్థీ ఫీజులపై నిరాశకు లోనవొద్దనే దిశగా చర్చించాం’’ అని వివరించారు. మొత్తం ఫీజులను రీయింబర్స్ చేయాల్సిందేనన్న ఇద్దరు మంత్రుల బహిరంగ వ్యాఖ్యలను గుర్తు చేయగా, వారేం మాట్లాడిందీ తనకు తెలియదని చెప్పారు.
ఎరువుల బలం కంపెనీలకే.. రవాణా భారం రైతులపైనే..
- ఎమ్మార్పీ రేటు రూ.281... డీలర్ల ధర రూ.350
- రైతులపై ఏటా 200 కోట్ల భారం
- డీలర్లకు రవాణా చార్జీలు ఇవ్వని ఎరువుల కంపెనీలు
- దాంతో ఆ భారాన్ని అన్నదాతలపై వేస్తున్న డీలర్లు
- పట్టించుకోని వ్యవసాయ శాఖ
హైదరాబాద్, న్యూస్‌లైన్ : మద్యం బాటిళ్లను కచ్చితంగా ఎమ్మార్పీ రేటుకే విక్రయించాలని చెబుతున్న ప్రభుత్వం.. రైతుకు అవసరమయ్యే ఎరువులకు మాత్రం ఈ నిబంధన వర్తింపజేయడం లేదు! ఒక్కో యూరియా బస్తాపై డీలర్లు ఎమ్మార్పీ ధర కన్నా రూ.70 అధికంగా దోచుకుంటున్నా పట్టించుకోవడం లేదు. రూ.281 ఉన్న యూరియా బస్తాను డీలర్లు, వ్యాపారులు రైతులకు రూ.350కు విక్రయిస్తున్నారు. ఇలా ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరలకు కొనుగోలు చేయాల్సి రావడంతో రాష్ట్ర రైతులపై ఏటా రూ.200 కోట్ల భారం పడుతోంది!!
ఖరీఫ్ సీజనులో వర్షాలు ఆలస్యంగా రావడంతో పంటల సాగు కూడా ఆలస్యమైంది. ఓ మోస్తరు వర్షాలకుతోడు ఎరువులు వేస్తే ఫలితం ఉంటుందన్న ఆశతో రైతులు ప్రస్తుతం ఎరువులు వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మొక్కల పెంపులో కీలక పాత్ర పోషించే కాంప్లెక్సు ఎరువుల బస్తా సగటున రూ.1200 ఉండడంతో యూరియాను ఆశ్రయిస్తున్నారు. వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో యూరియాకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. బస్తా యూరియాకు రూ.281 ఎమ్మార్పీ ఉంటే డీలర్లు, వ్యాపారులు మాత్రం రైతుల నుంచి ఒక్కో బస్తాకు రూ.350 ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన వ్యవసాయ శాఖ.. ఎరువుల కంపెనీలకే వత్తాసు పలుకుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రవాణా చార్జీలను కంపెనీలు తమకు ఇవ్వకపోవడం వల్లే అధిక ధరలకు అమ్మాల్సివస్తోందని డీలర్లు ఎన్నిసార్లు చెప్పినా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదు.
కంపెనీల ధోకా...
ఎమ్మార్పీ రూ.281.60 ఉండే 50 కిలోల యూరియా బస్తాను నాగార్జున ఫెర్టిలైజర్స్, కెమికల్స్ లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌సీఎల్) కంపెనీ డీలర్లకు రూ.272.10కు సరఫరా చేస్తోంది. వ్యాట్ మినహాయిస్తే ఎన్‌ఎఫ్‌సీఎల్ యూరియా బస్తాపై డీలర్లకు రూ.9.50 మిగులుతోంది. ఈ ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా ఉండేందుకు కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం రవాణా చార్జీలు ఇస్తుంది.
ఒక్కో యూరియా బస్తాపై 25 కిలో మీటర్లు అయితే రూ.13.70, 50 కిలో మీటర్లకు రూ.16.25, 70 కిలో మీటర్లకు రూ.19.30, వంద కిలో మీటర్లకు రూ.25 చొప్పున కేంద్ర ప్రభుత్వమే కంపెనీలకు రవాణా చార్జీలు చెల్లిస్తుంది. ఓడ రేవుల నుంచి దేశంలో ఎలాంటి మారుమూల ప్రాంతానికైనా స్థానిక పరిస్థితులను బట్టి ఎమ్మార్పీ ధరల్లో తేడా లేకుండా ఉండేలా ఈ రవాణా చార్జీలను కేంద్రం ఖరారు చేస్తుంది. ఇలా కేంద్రం ఇచ్చే రవాణా చార్జీలను అన్ని ఎరువుల కంపెనీలు బొక్కేస్తున్నాయి. జిలా కేంద్రాల నుంచి లారీల్లో ఎరువులను పంపి డీలర్లతోనే వాటా కిరాయిలు కట్టిస్తున్నాయి.
ఇదేమిటని ప్రశ్నించిన డీలర్లకు ఎరువులు ఇవ్వకుండా వేధిస్తున్నాయి. ఇలా రవాణా చార్జీలతోపాటు హమాలీ, కంపెనీలకు చెల్లించే మొత్తానికి తీసే బ్యాంకు డీడీ కమీషను, విలువ ఆధారిత పన్ను కలిపి ఒక్కో యూరియా బస్తాకు జిల్లా కేంద్రంలోనే కనీసం రూ.301 అవుతోందని డీలర్లు చెబుతున్నారు. జిల్లా కేంద్రం నుంచి దూరం పెరిగే కొద్దీ రవాణా చార్జీల భారం పెరుగుతోందని, విధిలేని పరిస్థితుల్లో ఆ మొత్తాన్ని తాము రైతుల నుంచి వసూలు చేయాల్సి వస్తోందని అంటున్నారు. తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, ఉత్తరప్రదేశ్‌లో ఎరువుల అమ్మకంపై పన్ను మినహాయించారు. దీంతో రైతులపై భారం తగ్గింది. మన ప్రభుత్వం మాత్రం రైతులకు ఎమ్మార్పీకి ఎరువులను అందించే ప్రయత్నం కూడా చేయడంలేదు.
అవసరం లేని ఎరువులను అంటగడుతున్న ‘మన గ్రోమోర్’
ఖరీఫ్, రబీల్లో కలిపి రాష్ట్రంలో ఏటా దాదాపు 70 లక్షల టన్నుల ఎరువులు వినియోగమవుతాయి. కాంప్లెక్సు ఎరువుల్లో 60 శాతం, డీఏపీ ఎరువుల్లో 25 శాతం వరకు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీయే సరఫరా చేస్తుంటుంది. రైతులకు నేరుగా ఎరువులను అందించేందుకు వీలుగా ఈ కంపెనీ ‘మన గ్రోమోర్’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 420 ఔట్‌లెట్లను ఏర్పాటు చేసింది.
వ్యవసాయ శాఖ ఈ కేంద్రాలను రిటైల్ డీలర్లతో సమానంగా పరిగణిస్తూ డీఏపీ, యూరియా, కాంపెక్లు ఎరువులను కేటాయిస్తోంది. రైతులు తమకు అవసరమైన డీఏపీ, యూరియా కోసం తప్పనిసరిగా మన గ్రోమోర్ కేంద్రాలకే వెళ్లాల్సి వస్తోంది.
కోరమండల్ కంపెనీ రైతుల అవసరాలను ఆసరగా చేసుకుని వారికి అవసరం లేకున్నా రూ.300 నుంచి రూ.500 విలువ చేసే వర్మీకంపోస్టు, సల్ఫర్, సూపర్, బయో, ఆర్గానిక్, ఇతర సూక్ష్మపోషక ఎరువులను అంటగడుతోంది. రోజుల తరబబడి దుకాణాల ముందు నిల్చుంటేనే ఒక బస్తా ఎరువు ఇవ్వని మన గ్రోమోర్ కేంద్రాలు ఈ ఉప ఉత్పత్తులను మాత్రం లారీల ద్వారా నేరుగా రైతుల ఇళ్ల వద్దకు చేర్చుతోంది. వీటిని నివారించాల్సిన వ్యవసాయ శాఖ మాత్రం చోద్యం చూస్తోంది.
సీజనులో వర్షాలు ఆలస్యంగా రావడంతో పంటల సాగు కూడా ఆలస్యమైంది. ఓ మోస్తరు వర్షాలకుతోడు ఎరువులు వేస్తే ఫలితం ఉంటుందన్న ఆశతో రైతులు ప్రస్తుతం ఎరువులు వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మొక్కల పెంపులో కీలక పాత్ర పోషించే కాంప్లెక్సు ఎరువుల బస్తా సగటున రూ.1,200 ఉండడంతో యూరియాను ఆశ్రయిస్తున్నారు. వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో యూరియాకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.
బస్తా యూరియాకు రూ.281 ఎమ్మార్పీ ఉంటే డీలర్లు, వ్యాపారులు మాత్రం రైతుల నుంచి ఒక్కో బస్తాకు రూ.350 ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన వ్యవసాయ శాఖ.. ఎరువుల కంపెనీలకే వత్తాసు పలుకుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రవాణా చార్జీలను కంపెనీలు తమకు ఇవ్వకపోవడం వల్లే అధిక ధరలకు అమ్మాల్సివస్తోందని డీలర్లు ఎన్నిసార్లు చెప్పినా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదు.

ఒక్కో యూరియా బస్తాపై 25 కిలో మీటర్లు అయితే రూ.13.70, 50 కిలో మీటర్లకు రూ.16.25, 70 కిలో మీటర్లకు రూ.19.30, వంద కిలో మీటర్లకు రూ.25 చొప్పున కేంద్ర ప్రభుత్వమే కంపెనీలకు రవాణా చార్జీలు చెల్లిస్తుంది. ఓడ రేవుల నుంచి దేశంలో ఎలాంటి మారుమూల ప్రాంతానికైనా స్థానిక పరిస్థితులను బట్టి ఎమ్మార్పీ ధరల్లో తేడా లేకుండా ఉండేలా ఈ రవాణా చార్జీలను కేంద్రం ఖరారు చేస్తుంది. ఇలా కేంద్రం ఇచ్చే రవాణా చార్జీలను అన్ని ఎరువుల కంపెనీలు బొక్కేస్తున్నాయి. జిల్లా కేంద్రాల నుంచి లారీల్లో ఎరువులను పంపి డీలర్లతోనే వాటా కిరాయిలు కట్టిస్తున్నాయి. ఇదేమిటని ప్రశ్నించిన డీలర్లకు ఎరువులు ఇవ్వకుండా వేధిస్తున్నాయి. ఇలా రవాణా చార్జీలతోపాటు హమాలీ, కంపెనీలకు చెల్లించే మొత్తానికి తీసే బ్యాంకు డీడీ కమీషను, విలువ ఆధారిత పన్ను కలిపి ఒక్కో యూరియా బస్తాకు జిల్లా కేంద్రంలోనే కనీసం రూ.301 అవుతోందని డీలర్లు చెబుతున్నారు.
జిల్లా కేంద్రం నుంచి దూరం పెరిగే కొద్దీ రవాణా చార్జీల భారం పెరుగుతోందని, విధిలేని పరిస్థితుల్లో ఆ మొత్తాన్ని తాము రైతుల నుంచి వసూలు చేయాల్సి వస్తోందని అంటున్నారు. తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, ఉత్తరప్రదేశ్‌లో ఎరువుల అమ్మకంపై పన్ను మినహాయించారు. దీంతో రైతులపై భారం తగ్గింది. మన ప్రభుత్వం మాత్రం రైతులకు ఎమ్మార్పీకి ఎరువులను అందించే ప్రయత్నం కూడా చేయడంలేదు.
అవసరం లేని ఎరువులను అంటగడుతున్న ‘మన గ్రోమోర్’
ఖరీఫ్, రబీల్లో కలిపి రాష్ట్రంలో ఏటా దాదాపు 70 లక్షల టన్నుల ఎరువులు వినియోగమవుతాయి. కాంప్లెక్సు ఎరువుల్లో 60 శాతం, డీఏపీ ఎరువుల్లో 25 శాతం వరకు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీయే సరఫరా చేస్తుంటుంది. రైతులకు నేరుగా ఎరువులను అందించేందుకు వీలుగా ఈ కంపెనీ ‘మన గ్రోమోర్’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 420 ఔట్‌లెట్లను ఏర్పాటు చేసింది. వ్యవసాయ శాఖ ఈ కేంద్రాలను రిటైల్ డీలర్లతో సమానంగా పరిగణిస్తూ డీఏపీ, యూరియా, కాంపెక్లు ఎరువులను కేటాయిస్తోంది.
రైతులు తమకు అవసరమైన డీఏపీ, యూరియా కోసం తప్పనిసరిగా మన గ్రోమోర్ కేంద్రాలకే వెళ్లాల్సి వస్తోంది. కోరమండల్ కంపెనీ రైతుల అవసరాలను ఆసరగా చేసుకుని వారికి అవసరం లేకున్నా రూ.300 నుంచి రూ.500 విలువ చేసే వర్మీకంపోస్టు, సల్ఫర్, సూపర్, బయో, ఆర్గానిక్, ఇతర సూక్ష్మపోషక ఎరువులను అంటగడుతోంది. రోజుల తరబబడి దుకాణాల ముందు నిల్చుంటేనే ఒక బస్తా ఎరువు ఇవ్వని మన గ్రోమోర్ కేంద్రాలు ఈ ఉప ఉత్పత్తులను మాత్రం లారీల ద్వారా నేరుగా రైతుల ఇళ్ల వద్దకు చేర్చుతోంది. వీటిని నివారించాల్సిన వ్యవసాయ శాఖ మాత్రం చోద్యం చూస్తోంది.

వాన్‌పిక్‌పై బాబు వీధి నాటకం .
వాన్‌పిక్‌పై బాబు వీధి నాటకం * వాన్‌పిక్‌పై వాస్తవాలు దాచి బాబు రాద్ధాంతం * 28 వేల ఎకరాలిచ్చారంటూ అడ్డగోలు ప్రచారం * నిజాలకు గంతలు కడుతూ ధర్నాలు, యాత్రలు * వాన్‌పిక్ ప్రతిపాదన వచ్చిందే బాబు హయాంలో * భూ సంతర్పణల్లో అద్వితీయ రికార్డు కూడా ఆయనదే * నిందలే.. నిజాలతో పనిలేదు * వాన్‌పిక్‌పై వాస్తవాలు విస్మరిస్తున్న టీడీపీ * 18 వేలకు బదులు 28 వేల ఎకరాలిచ్చారంటూ రాద్ధాంతం * 18 వేల ఎకరాలు కేటాయించినా ఇప్పటిదాకా సేకరించింది 13 వేల ఎకరాలే * అధికం అసైన్డ్ భూమి కావడంతో ప్రభుత్వానికి అప్పగించిన వాన్‌పిక్ * దాన్లో 6వేల ఎకరాల్ని ఇంకా వాన్‌పిక్‌కు లీజుకివ్వని సర్కారు * ఈ జాప్యంతో టెండర్లు పిలిచినా మొదలుకాని పనులు * 2 పోర్టులు, షిప్‌యార్డు, ఎయిర్‌పోర్ట్‌కు 6,800.. * పోర్టు ఆధారిత పరిశ్రమలకు 11,200 ఎకరాలు * ఇవి వదిలి పోర్టుకు 28 వేల ఎకరాలిచ్చారంటున్న టీడీపీ * రెండు పోర్టులు, ఎయిర్‌పోర్టు, షిప్‌యార్డు, సెజ్‌కు ఇచ్చింది 18 వేల ఎకరాలే * రస్ అల్ ఖైమాతో ఒప్పందానికి ముందే జగతిలో నిమ్మగడ్డ పెట్టుబడి * అయినా సరే వాన్‌పిక్ దక్కినందుకే పెట్టుబడి పెట్టారంటూ వితండ వాదన జరుగుతున్న తతంగం చూస్తుంటే చంద్రబాబు గానీ, టీడీపీగానీ వాన్‌పిక్‌కు సంబంధించిన నిజాల్ని కావాలనే విస్మరిస్తున్నారన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే దీనికి కేటాయించిన భూమి విషయంలో రాజకీయ పక్షాలన్నీ తప్పుడు లెక్కలే చెబుతూ వస్తున్నాయి. వాడరేవు అండ్ నిజాంపట్నం పోర్ట్స్ ఇండస్ట్రియల్ కారిడార్. ఇదే వాన్‌పిక్. అంటే వాడరేవులో ఒకటి, నిజాంపట్నంలో ఒకటి చొప్పున రెండు పోర్టులు, షిప్‌యార్డు, విమానాశ్రయం, పరిశ్రమల కారిడార్. ఇవన్నీ కలిస్తేనే వాన్‌పిక్. దీనికోసం ప్రభుత్వం వివిధ జీవోల ద్వారా సేకరించడానికి అనుమతించిన భూమి 22,990 ఎకరాలు. అంటే 23వేల ఎకరాలు. కాకపోతే ఆయా జీవోల్లో పేర్కొన్న ప్రాంతాల్లో అటవీ భూములు, పర్యావరణ పరంగా ఇబ్బందులు ఎదురయ్యే ఇతర భూములు గనక ఉంటే వాటిని మినహాయించాలని జీవోల్లో స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో అలాంటి భూముల్ని సేకరించటం లేదని తెలియజేస్తూ వాన్‌పిక్ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి లేఖలు పంపింది. దాన్ని తగిన ధర చెల్లించి సేకరించిన వాన్‌పిక్... అసైన్డ్ భూముల్ని తాను తీసుకోవటానికి వీల్లేదు కనక తిరిగి ప్రభుత్వానికి అప్పగించింది. ప్రభుత్వం వాటిని వాన్‌పిక్‌కు తిరిగి లీజుకివ్వాల్సి ఉంటుంది. నిజానికి ఇలా 12,973 ఎకరాలు సేకరించి ప్రభుత్వానికి వాన్‌పిక్ అప్పగించగా... దాన్లో 6,418 ఎకరాలను మాత్రమే ప్రభుత్వం వాన్‌పిక్‌కు అప్పగించింది. మిగిలిన భూమిపై తాత్సారం చేస్తూ ఉండటంతో, దాన్లో పోర్టులకు సంబంధించిన భూమి ఉండటంతో ప్రాజెక్టుకు టెండర్లు పిలిచి కూడా మొదలుపెట్టలేకపోతున్నట్లు వాన్‌పిక్ పేర్కొంటోంది. మొత్తమ్మీద ఎకరాకు కనిష్టంగా 1.2 లక్షల నుంచి గరిష్టంగా రూ.5 లక్షలు వెచ్చించి వాన్‌పిక్ సంస్థ భూముల్ని కొనుగోలు చేసింది. ఇందుకోసం దాదాపు రూ.450 కోట్లు ఖర్చుపెట్టింది. అంటే మొత్తమ్మీద సగటున ఎకరాకు రూ.3.5 లక్షలు ఖర్చుచేసింది. ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఒక్కటే భూముల వివరాలన్నీ ఇంత స్పష్టంగా ఉన్నపుడు అటు చంద్రబాబు గానీ, ఇటు తెలుగుదేశం పార్టీ గానీ 28,000 ఎకరాల్ని వాన్‌పిక్‌కు కట్టబెట్టారంటూ ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయి? అసలు 28వేల ఎకరాలనే సంఖ్య ఎక్కడి నుంచి వచ్చింది? ఒకే పోర్టుకు అన్నివేల ఎకరాల్ని ఇచ్చేశారని చెబుతున్న చంద్రబాబునాయుడికి ఆ 18వేల ఎకరాల్ని కేటాయించింది ఒక పోర్టుకు కాదని, అక్కడ రెండు పోర్టులు, షిప్‌యార్డు, విమానాశ్రయం, పారిశ్రామిక కారిడార్ వస్తాయని తెలియదా? ఇదంతా రాజకీయం కోసమే చేస్తున్నారనటానికి ఇంకా నిదర్శనమేం కావాలి? బాబు రాయితీల వెల్లువ ఇదీ.. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు కోసం జీఎంఆర్ సంస్థకు చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్ సమీపంలో విలువైన 5,500 ఎకరాల్ని కేటాయించింది. దీంతో పాటు వడ్డీ లేకుండా రూ.315 కోట్ల రుణాన్ని సమకూర్చింది. మరో రూ.107 కోట్లను అడ్వాన్స్‌డ్ డెవలప్‌మెంట్ గ్రాంట్‌గా అందజేసింది. ఇవన్నీ చేసి కూడా... తొలి ఎనిమిదిన్నర ఏళ్ల పాటు లీజు మొత్తాన్ని చెల్లించకుండా మినహాయింపునిచ్చింది. గంగవరం పోర్టు కోసం 2,800 ఎకరాల్ని బాబు కేటాయించారు. దీంలో 1,400 ఎకరాలు విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి తీసుకుని మరీ ఇచ్చారు. దీన్లో 1,800 ఎకరాల్ని రాష్ట్ర ప్రభుత్వ వాటాగా (ఈక్విటీ), మిగిలిన భూమిని లీజు పద్ధతిలోనూ సమకూర్చారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇచ్చిన భూమికి కట్టిన విలువెంతో తెలుసా? కేవలం ఎకరం రూ.2.86 లక్షలు. విశాఖపట్నానికి కూతవేటు దూరంలో స్టీల్‌ప్లాంట్లో భాగంగా ఉన్న ఈ భూములకు అప్పట్లోనే ఎకరా ధర రూ.50 లక్షలకు తక్కువ కాకుండా ఉండేది. అలాంటి చోట ఎకరా కేవలం 2.86 లక్షలకే ఇచ్చిన ఘనత బాబుది. ప్రస్తుత ప్రభుత్వానిదీ ఇదే తీరు... ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఇటీవలే మచిలీపట్నం పోర్టు కోసం నవయుగ సంస్థకు 5,324 ఎకరాల భూమిని లీజు పద్ధతిలో కేటాయించటానికి అంగీకరించింది. దీంతో పాటు రూ.355 కోట్ల ఆర్థిక సాయం చేయాలని కూడా ప్రతిపాదించింది. నిజానికి ఈ పోర్టుకు గతంలో టెండర్లు పిలిచినపుడు రామలింగ రాజుకు చెందిన మేటాస్ ఇన్‌ఫ్రా దక్కించుకుంది. తరువాతి పరిస్థితుల నేపథ్యంలో దాన్ని రద్దు చేసి నవయుగ సంస్థను ఎంపిక చేశారు. చంద్రబాబు ఒక ఎయిర్‌పోర్టుకు 5,500 ఎకరాలిచ్చారు. అదీ హైదరాబాద్ సమీపంలో. పోర్టుకు 2,800 ఎకరాలిచ్చారు. విశాఖ నగరంలో. కిరణ్ కుమార్ రెడ్డి మరో పోర్టుకు 5,324 ఎకరాలిచ్చారు. అవేవీ తప్పు కానపుడు వైఎస్ ప్రభుత్వం రెండు పోర్టులు, ఒక ఎయిర్‌పోర్టు, షిప్‌యార్డు, పారిశ్రామిక కారిడార్‌కు కలిపి 18,000 ఎకరాలివ్వటం ఏ విధంగా తప్పు? చంద్రబాబు హయాంలోనే ప్రతిపాదన.. ఆ స్థానంలో రస్ అల్ ఖైమా ప్రభుత్వం ముందుకు రాగా... దాంతో ప్రభుత్వం వాన్‌పిక్ కోసం ఒప్పందం చేసుకుంది. రస్ అల్‌ఖైమా తన భారత భాగస్వామిగా తనకు యాదృచ్ఛికంగా కలిసిన, అప్పటికే పారిశ్రామిక వేత్తగా అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించిన నిమ్మగడ్డ ప్రసాద్‌ను ఎంచుకుంది. ఆయనకు చెందిన ‘మ్యాట్రిక్స్ ఎన్‌పోర్ట్స్’తో ఒప్పందం చేసుకుంది. జరిగింది ఇదైతే.. మ్యాట్రిక్స్‌కు వైఎస్ కావాలనే భూముల్ని కేటాయించారని విమర్శలు చేస్తుండటం సమంజసమా? ‘బూట్’ మార్చారంటూ అడ్డగోలు వాదన... ఈ ప్రాజెక్టును తొలుత బిల్ట్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (బూట్) పద్ధతిలో ప్రతిపాదించారని, తరవాత దాన్ని బిల్ట్ ఆపరేట్ ఓన్(బూ) పద్ధతికి మార్చారని వివిధ పక్షాలు చెబుతున్నాయి. ఇలా మార్చటంలోనే అప్పటి ప్రభుత్వం చేసిన కుట్ర దాగి ఉందంటూ సీబీఐ కూడా వాదిస్తోంది. దీన్లో నిజానిజాలేంటో చూద్దాం... బూట్ అంటే లీజు గడువు ముగిశాక తిరిగి ప్రభుత్వానికి అప్పగించటం. బూ అంటే లీజు గడువేదీ ఉండదు. వాన్‌పిక్‌లో పోర్టులు, షిప్‌యార్డు, విమానాశ్రయం బూట్ పద్ధతిలోనే ప్రతిపాదించారు. ఇప్పటికీ బూట్ పద్ధతిలోనే ఉన్నాయి కూడా. అంటే వీటిని నిర్మించి, నిర్వహించి, లీజు గడువు ముగిశాక ప్రభుత్వానికి అప్పగిస్తారు. ఇక పారిశ్రామిక కారిడార్ విషయానికొస్తే దాన్ని మొదట్లో ‘బూట్’ అని గానీ, ‘బూ’ అని గానీ పేర్కొనలేదు. కన్సెషన్ ఒప్పందంలో దాన్ని ‘బూ’ పద్ధతిలో ఇస్తున్నట్లుగా పేర్కొన్నారన్నది సీబీఐ వాదన. నిజానికి ఏ సెజ్‌గానీ, ఏ ఇండస్ట్రియల్ కారిడార్ గానీ బూట్ పద్ధతిలో ఉండదు. ఎందుకంటే లీజు గడువు ముగిశాక తిరిగి ప్రభుత్వానికి అప్పగించే ప్రాతిపదికన ఏ కంపెనీ కూడా తన యూనిట్‌ను ఏర్పాటు చేయటానికి ముందుకు రాదు. ఇది చంద్రబాబుకు గానీ, సీబీఐకి గానీ తెలియక కాదు. ఎందుకంటే విశాఖ ఫార్మాసిటీ విషయంలో చంద్రబాబు నాయుడు తొలుత ‘బూట్’ పద్ధతిలోనే టెండర్లు పిలిచారు. ఏ ఒక్కరూ రాకపోయేసరికి దాన్ని ‘బూ’ పద్ధతికి మార్చారు. అప్పుడు రాంకీ సంస్థ ముందుకు రాగా... దానికి భూమిని కట్టబెట్టారు. ఈ విషయాన్ని జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడుల కేసుకు సంబంధించి దాఖలు చేసిన 3వ చార్జిషీట్లో సీబీఐ కూడా వివరంగా పేర్కొంది. కాకపోతే అప్పుడు చంద్రబాబు చేసిన చర్య దానికి తప్పుగా కనిపించలేదు. వాన్‌పిక్ విషయంలో మాత్రం అది తీవ్ర నేరంగా కనిపిస్తుండటం గమనార్హం. భూ విక్రయదారులకు చెల్లించినదెంత? మరి మిగిలిన 2 లక్షలు ఎక్కడికెళ్లాయి? ఇది తేలాలి’’ అంటోంది సీబీఐ. అయితే తాము సేకరించినవన్నీ అసైన్డ్ భూములని, ఈ రకం భూముల్లో తొలి అసైనీ ఒకరైతే దాన్ని బదిలీ చేసుకున్న వ్యక్తి మరొకరని, వాస్తవంగా ఆ భూమిని అనుభవిస్తున్నది మరొకరని... అలాంటపుడు తాము ఆ ముగ్గురికీ ఎంతో కొంత మొత్తం చెల్లిస్తే తప్ప వారు సంతకం చేయని పరిస్థితి ఉండేదని వాన్‌పిక్ చెబుతోంది. ‘‘అలాంటి పరిస్థితుల్లో ఆ ముగ్గురికీ ఎంతో కొంత చెల్లించటం జరిగింది. అలా చెల్లించిన ప్రతి పైసానూ రికార్డుల్లో చూపించాం. ప్రతి పైసాకూ లెక్కలున్నాయి’’ అని వాన్‌పిక్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. పోనీ వీరిద్దరి వాదనల్లోనూ వైరుధ్యాలున్నాయనే అనుకుందాం. మరి వాన్‌పిక్ వద్ద ప్రతి పైసాకూ లెక్కలున్నాయని చెబుతున్నపుడు... సదరు భూమి కోసం నిజంగా ఎంతమందికి ఎంత మొత్తం చెల్లించారన్నది ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవటం కష్టమా? నేరుగా ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తే ఎవరికివారు వచ్చి నిజం చెప్పకుండా ఉంటారా? మరి సర్కారు ముందు ఇలాంటి మార్గం ఉన్నపుడు అవేమీ చేయకుండా ఆరోపణలు మరింత ముదరటానికి, అపోహలు తీవ్రమవటానికి ఎందుకు కారణమవుతోంది? ఇదీ.. రైతుల మాట అమ్ముకొని బాగుపడ్డాం - వడ్లమూడి సామ్రాజ్యం, గొల్లపాలెం, మోటుపల్లి పంచాయతీ, చినగంజాం మండలం అభివృద్ధి కుంటుపడింది - మీసాల ఏడుకొండలు, కొత్తరెడ్డిపాలెం, వేటపాలెం మండలం ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందా? ఒప్పందం ప్రకారం 18 వేల ఎకరాలనూ సేకరించాల్సింది వాన్‌పిక్ సంస్థే. దీన్లో ప్రభుత్వ భూమి 174 ఎకరాలే. మిగిలినదాంట్లో అత్యధికం ప్రభుత్వం వివిధ వర్గాలకు కేటాయించిన అసైన్డ్ భూమి. దానికి తగిన పరిహారం చెల్లించి, కొనుగోలు చేసి తిరిగి ప్రభుత్వానికే అప్పగిస్తుంది వాన్‌పిక్. దాన్ని తిరిగి ప్రభుత్వం ఈ సంస్థకు కేటాయించాలి. ఇదో వినూత్న పద్ధతి. కేటాయించేది కూడా ప్రభుత్వ భూమి కాదు కనుక ప్రభుత్వం నష్టపోయేదేమీ ఉండదు. పెపైచ్చు వాన్‌పిక్ చెబుతున్న దాని ప్రకారం మొత్తం 18 వేల ఎకరాల్లో వారు సేకరిస్తున్న పట్టాభూములు 3,400 ఎకరాలు. దాదాపు 20 శాతం. దీన్నిబట్టి నిరాశ్రయుల సంఖ్య సాధ్యమైనంత తక్కువగా ఉండటానికి అప్పటి ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుందన్నది తెలియకమానదు. మరి దీన్లో ప్రభుత్వం నష్టపోయేదేముంది? ప్రలోభాలకు గురి చేస్తున్నారు - ప్రళయకావేరి రాములు, రామచంద్రాపురం, వేటపాలె మండలం మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చేవి - అప్పల నాగేశ్వరరెడ్డి, పాతరెడ్డిపాలెం, పుల్లరిపాలెం పంచాయతీ, వేట పాలెం మండలం |
వైఎస్ పథకాలు ఎత్తేసే కుట్ర
- ఫీజుల పథకాన్ని నీరుగార్చడానికి మంత్రివర్గ ఉపసంఘం పేరుతో ప్రభుత్వం డ్రామా ఆడుతోంది
- ఫీజుల చెల్లింపు పథకాన్ని తానే ప్రవేశపెట్టానంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలాడుతున్నారు
హైదరాబాద్, న్యూస్‌లైన్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బడుగు, బలహీనవర్గాల కోసం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలన్నింటినీ ఎత్తివేసేందుకు కాంగ్రెస్, టీడీపీలు కుట్ర పన్నుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఉప నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్ పథకాలను ఒక్కొక్కటిగా తుంగలో తొక్కుతూ ప్రజలు ఆయన్ని మర్చిపోయేలా చేసేందుకు యత్నిస్తున్నాయన్నారు. ఫీజుల పథకాన్ని నీరుగార్చేందుకే మంత్రివర్గ ఉపసంఘం పేరుతో ప్రభుత్వం డ్రామా ఆడుతోందన్నారు.
పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాపరెడ్డితో కలిసి బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నారని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గతంలో అనేకసార్లు ఆవేదన వ్యక్తం చేసినప్పుడు.. ఏ పథకాన్ని సక్రమంగా అమలు చేయడంలేదో చెప్పాలని సీఎం, మంత్రులు అడిగారు. ఇప్పుడు ఫీజు పథకంపై సీఎం, మంత్రులు ఏం సమాధానం చెబుతారు’’ అని శోభానాగిరెడ్డి ప్రశ్నించారు.
‘‘వైఎస్‌కన్నా మేలైన విధంగా ఫీజుల పథకం అమలు చేస్తామన్నారు.. మరి ఇంజనీరింగ్ విద్యార్థులకు రూ.31 వేలకు మించి చెల్లించబోమని చెప్పడం ఎంతవరకు సమంజసం? పైగా మిగిలిన రూ.19 వేలు విద్యార్థులకు రుణాలు ఇప్పిస్తారట. రైతులకు, కౌలుదారులకే అప్పులు ఇచ్చే దిక్కులేదు..’’ అని విమర్శించారు. ‘వైఎస్ చేపట్టిన ఫీజులు చెల్లింపు, వృద్ధాప్య, వితంతు పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ వంటి పథకాల వల్ల సమాజంలో 50 శాతం ఉన్న బీసీలే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారు. వీటిని నీరుగార్చడంతో నష్టపోయేది ఆ వర్గాలే’నని చెప్పారు.
సంక్షేమ పథకాలను ఎత్తివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, అందుకు టీడీపీ సహకరిస్తోందని చెప్పారు. ఇదంతా ఒక కుట్ర ప్రకారం జరుగుతోందన్నారు. ఫీజుల పథకాన్ని తానే ప్రవేశపెట్టానని చెప్పుకొంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారన్నారు. ఆయన హయాంలో బీసీ, మైనారిటీ విద్యార్థులకు రూ.300 ముష్టిగా మాత్రమే ఇచ్చారని గుర్తుచేశారు. మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఒవైసీ కూడా ఈ విషయాన్ని అసెంబ్లీలో ఉదహరించారని తెలిపారు.
సోనియాను విజయమ్మ కలిసినట్లు నిరూపిస్తారా?
తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ.. సోనియాగాంధీని కలిసినట్లు రుజువు చేస్తే పార్టీ ఎమ్మెల్యేలందరూ శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతామని, నిరూపించలేకపోతే చంద్రబాబు ఒక్కరు రాజకీయాల నుంచి తప్పుకుంటే చాలని శోభా నాగిరెడ్డి సవాలు విసిరారు.
నేడు జిల్లాల్లో ధర్నాలు
ఫీజుల పథకంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10.30కు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు, రాజధానిలో ఉన్నత విద్యా మండలి కార్యాలయం వద్ద ధర్నాలు చేపడుతున్నట్టు పుత్తా ప్రతాపరెడ్డి తెలిపారు.

11,800 ఎకరాలు ఎక్కువా?
|
ముడుపులకు ఎక్కడైనా లాభాలొస్తాయా?
|
'వైఎస్ పథకాల నిలిపివేతకు కుట్ర'
మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆపివేయాలనే కుట్ర జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ కుట్రలో భాగస్వాములంటూ ఆ పార్టీ డిప్యుటీ ఫ్లోర్ లీడర్ శోభా నాగిరెడ్డి ఆరోపించారు. ఒక ప్రణాళిక ప్రకారమే ఇదంతా జరుగుతోందని ఆమె అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని యథావిథిగా అమలు చేయాలని శోభానాగిరెడ్డి డిమాండ్ చేశారు. సోనియాను వైఎస్ విజయమ్మ కలిశారని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని ఈ విషయాన్ని నిరూపిస్తే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలందరం రాజకీయాల నుంచి తప్పుకుంటామని, నిరూపించకపోతే చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ఆమె సవాల్ విసిరారు.
'అత్యంత ప్రజాదరణ కలిగిన నేత జగన్'
అనంతపురం: వైఎస్ జగన్ అత్యంత ప్రజాదరణ కలిగిన నేతని లక్ష్మీపార్వతి అన్నారు. జగన్‌పై కుట్రతో అక్రమ కేసులు బనాయించారని ఆమె ఆరోపించారు. త్వరలోనే ప్రజల ఆశీస్సులతో జగన్ జైలు నుంచి బయటకొస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో రేపు ధర్నాలు
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నాలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తమ పార్టీ ఆధ్వర్యంలో రేపు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించనున్నామని వైఎస్‌ఆర్ సీపీ నేత పుత్తా ప్రతాప్‌రెడ్డి తెలిపారు. కార్యకర్తలందరూ ధర్నాల్లో పాల్గొని ప్రభుత్వం కళ్లు తెరిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Tuesday, 7 August 2012
ఎంపీగా మేకపాటి ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ : నెల్లూరు నుంచి ఎంపీగా ఎన్నికైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు బుధవారం ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ ఎంపీలుగా ఎన్నికైన మేకపాటి రాజమోహన్ రెడ్డి, సమాజ్ వాది పార్టీ నాయకురాలు, యూపీ సీఎం సతీమణి డింపుల్ యాదవ్‌ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలుగులో ప్రమాణం చేయగా, డింపుల్ యాదవ్ హిందీలో ప్రమాణం చేశారు.
సర్కారు తీరుపై భగ్గుమంటున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
‘రీయింబర్స్‌మెంట్’ను అటకెక్కించే కుట్ర
- {పమాణాలు లేకుండా ఫలితాలెలా వస్తాయి ?
- ఉత్తీర్ణులవుతోంది 30 శాతమే
- 70 శాతం మందికి ఫీజులు ఇవ్వకుంటే ఎలా?
- పథకాన్ని పాతరేస్తే ఊరుకునేది లేదు
- సర్కారు తీరుపై భగ్గుమంటున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
కనీసం సగం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులయితేనే ఫీజు రీయింబర్స్‌మెంట్ అంటూ సర్కారు పాడుతున్న కొత్త పాట విద్యార్థులకు శాపంగా పరిణమించనుంది. మౌలిక సదుపాయాలు లేని కళాశాలలకు ఇబ్బడిముబ్బడిగా అనుమతులిచ్చిన సర్కారు, అందులో ఏ మేరకు నాణ్యమైన విద్య అందుతుందో అనే అంశపై మాత్రం దృష్టి పెట్టలేదు. ఫలితంగా ఆశించిన ఫలితాలు రావడం లేదు. ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక ప్రొఫెసర్ ఉండాలని నిబంధనలుండగా, సబ్జెక్టుకు కనీసం ఒక్క ప్రొఫెసర్ కూడా లేని కళాశాలలెన్నో ఉన్నాయి. కొన్ని కళాశాలలోని ప్రయోగశాలలో వసతులు కూడా సరిగా లేవంటే అతిశయోక్తి కాదు.
సిటీబ్యూరో, న్యూస్‌లైన్: జేఎన్టీయూహెచ్‌కు అనుబంధంగా నగరంలో 335 ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 2.8 ల క్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇటీవల విడుదలైన ఫలితాల ను చూస్తే, 70,349 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరైతే ఉత్తీర్ణులయింది మాత్రం 22,301మందే (31.7 శాతం). ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో 3.67 శాతం, సివిల్ ఇంజినీరింగ్‌లో 18.31 శాతం, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 22 శాతం, మైనింగ్ ఇంజినీరింగ్‌లో 27.59 శాతం, బయోటెక్నాలజీలో 29 శాతం, కెమికల్ ఇంజినీరింగ్‌లో 33 శాతం, ఐటీ లో 33.36 శాతం, ఈసీఈలో 33.8 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో 35 శాతం, తృతీయ సంవత్సరంలో 41 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. నుత్తీర్ణులయినవారిలో దాదాపు 90 శాతం మంది సగానికి పైగా సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయారు. సగం సబ్జెక్టుల్లో పాసైతేనే ఫీజులిస్తామంటూ సర్కారు విధించిన తాజా ఆంక్షలతో ఆ విద్యార్థుల భవిత ప్రశ్నార్థకంగా మారింది.
అనుత్తీర్ణతకు కారణాలెన్నో...
కర్ణుడి చావుకు సవాలక్ష కారణలన్నట్లు, ప్రమాణాలు లేని ఇంజినీరింగ్ కళాశాలలలో విద్యార్థు ల అనుత్తీర్ణతకూ అనేక కారణాలున్నాయి. గ్రా మీణ ప్రాంతాలలో ఇంటర్ వరకు తెలుగు మీ డియం చదివిన విద్యార్థులు బీటెక్‌లో ఆకస్మాత్తుగా ఇంగ్లిష్ మీడియంలోకి మారడానికి ఎన్నో అవస్థలు పడుతున్నారు.
ఇంజినీరింగ్ సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. సిల బస్ పూర్తి చేయాలాంటే కనీసం 40 వారాల తరగతులు అవసరం. సెకండ్ కౌన్సె లింగ్, స్పాట్ ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఆరు వారాలకు పైగా తరగతులు నష్టపోతున్నారు. శివారు ప్రాంతాలలో ఉన్న కళాశాలలో లెక్కకు ప్రొఫెసర్లున్నా, అర్హులు తక్కువే. ఇన్ని కష్టాల మధ్య విద్యార్థులు గట్టెక్కే పరిస్థితులు కల్పించని ప్రభుత్వం వారికి ఫీజు లివ్వమంటూ భయభ్రాంతులకు గురిచేయడం దారుణమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పేదలంటే సర్కారుకు చులకనా...
ఫీజుల భారాన్ని విద్యార్థులపై మోపేందుకు సర్కారు కుట్ర పన్నుతోంది. పేద కుటుంబాల పిల్లలకు ఆశాదీపమైన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ తీరుపై విద్యార్థులు నిప్పులు చెరుగుతున్నారు. అర్హత కలిగిన ఏ విద్యార్థీ డబ్బు లేదని ఉన్నత విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
ఆ యన ఆశయాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న స ర్కార్ వైఖరిని విద్యార్థులు ఖండిస్తున్నారు. పేద కుటుంబాల పిల్లలు సాంకేతిక, ఉన్నత చదువులకు అర్హులు కాకూడదా? ఉన్నత ఉద్యోగాలు ధనవంతుల పిల్లలే చేయాలా? అని ప్రశ్నిస్తున్నారు. డబ్బు లేకపోతేనేం తమకు అన్ని అర్హతలు ఉన్నాయంటున్నారు. పథకాన్ని ఎత్తివేస్తే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.
ఈ పథకం వల్లే నా బిడ్డ చదువుతున్నాడు
ఫీజ్ రీయింబర్స్‌మెం ట్ పథకం మావంటి పేదకుటుంబాలకు వరం. లక్షల్లో ఇంజనీరింగ్ ఫీజులు కట్టే స్థోమత లేని మాబోటి వారికి దారి చూపింది. మా బిడ్డ ఫైనల్ ఇయర్ వరకు వచ్చాడంటే అది రీయింబర్స్‌మెంట్ చలవే.
-ఎల్లయ్య, పేరెంట్
ప్రభుత్వ చేతకానితనమే
విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని కళాశాలలకు అనుమతులు మంజూరు చేయాల్సిన ప్రభుత్వం ఆమాటే మరిచింది. గతేడాది లక్షకు పైగా సీట్లు మిగిలిపోతే.. ఈ ఏడాది మరో లక్ష సీట్లు పెరిగేలా కళాశాలలకు అనుమతిచ్చింది. ఇది నిజంగా సర్కారు చేతగానీతనమే. మూడు శాతం ఉత్తీర్ణత కూడా సాధించని కళాశాలలను, పట్టుమని పది మంది విద్యార్థులు కూడా లేని కళాశాలలను మూసేయాలి. నాణ్యమైన విద్యను అందించడంలో విఫలమైన ప్రభుత్వం, పేదల చదువుకు ఆంక్షలు పెట్టడం విడ్డూరంగా ఉంది.
-లలిత్‌కుమార్,
ఐఐటీ-జేఈఈ ఫోరం కన్వీనర్
వైఎస్‌ఆర్ దయతోనే...
వ్యవసాయంపై ఆధారపడిన మా కుటుంబం ఇంజినీరింగ్ చదివించే స్థితిలో లేదు. వైఎస్‌ఆర్ దయతో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ద్వారా ఇంజినీరింగ్ చేస్తున్నా. ఈ పథకాన్ని తీసేస్తే నాలాంటి పేద విద్యార్థులు రోడ్డున పడతారు.
-అనిల్, చివరి సంవత్సరం విద్యార్థి
చదువుకు దూరవుతానని భయపడ్డా...
పెద్ద చదువు చదివే ఆశ వున్నా అప్పట్లో నాకు ఆ అవకాశం లేదు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పథకం తో నాకు ఇంజనీరింగ్ చదివే భాగ్యం కలిగింది. ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తామనటం సమంజసం కాదు.
- ప్రణయి, చివరి సంవత్సరం విద్యార్థి
ఫీజ్ రీయింబర్స్‌మెంట్ రద్దు సరికాదు...
ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నమ్ముకుని నావంటి విద్యార్థులెంతోమంది సాంకేతిక చదువులకు దగ్గరయ్యారు. ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేస్తే ఉన్నత చదువులు ఇకపై పేద, మధ్య తరగతి వర్గాలకు దూరం అయినట్లే.
-లోహిత్ కుమార్, ద్వితీయ సంవత్సరం విద్యార్థి
మహిళా సమాజానికి ఓ వరం:
మహిళలు విద్యార్థి దశ నుంచే అభివద్ధి చెందాలంటే ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం. అలాంటిదే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పథకం. దీంతోనే నేను ఇంజనీరింగ్ చదువు కోగలుగుతున్నా. దీన్ని రద్దు చేస్తే సహించేది లేదు.
-ఎం.లావణ్య, ద్వితీయ సంవత్సరం విద్యార్థి
- {పమాణాలు లేకుండా ఫలితాలెలా వస్తాయి ?
- ఉత్తీర్ణులవుతోంది 30 శాతమే
- 70 శాతం మందికి ఫీజులు ఇవ్వకుంటే ఎలా?
- పథకాన్ని పాతరేస్తే ఊరుకునేది లేదు
- సర్కారు తీరుపై భగ్గుమంటున్న విద్యార్థులు, తల్లిదండ్రులు
కనీసం సగం సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులయితేనే ఫీజు రీయింబర్స్‌మెంట్ అంటూ సర్కారు పాడుతున్న కొత్త పాట విద్యార్థులకు శాపంగా పరిణమించనుంది. మౌలిక సదుపాయాలు లేని కళాశాలలకు ఇబ్బడిముబ్బడిగా అనుమతులిచ్చిన సర్కారు, అందులో ఏ మేరకు నాణ్యమైన విద్య అందుతుందో అనే అంశపై మాత్రం దృష్టి పెట్టలేదు. ఫలితంగా ఆశించిన ఫలితాలు రావడం లేదు. ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక ప్రొఫెసర్ ఉండాలని నిబంధనలుండగా, సబ్జెక్టుకు కనీసం ఒక్క ప్రొఫెసర్ కూడా లేని కళాశాలలెన్నో ఉన్నాయి. కొన్ని కళాశాలలోని ప్రయోగశాలలో వసతులు కూడా సరిగా లేవంటే అతిశయోక్తి కాదు.
అనుత్తీర్ణతకు కారణాలెన్నో...
కర్ణుడి చావుకు సవాలక్ష కారణలన్నట్లు, ప్రమాణాలు లేని ఇంజినీరింగ్ కళాశాలలలో విద్యార్థు ల అనుత్తీర్ణతకూ అనేక కారణాలున్నాయి. గ్రా మీణ ప్రాంతాలలో ఇంటర్ వరకు తెలుగు మీ డియం చదివిన విద్యార్థులు బీటెక్‌లో ఆకస్మాత్తుగా ఇంగ్లిష్ మీడియంలోకి మారడానికి ఎన్నో అవస్థలు పడుతున్నారు.
ఇంజినీరింగ్ సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. సిల బస్ పూర్తి చేయాలాంటే కనీసం 40 వారాల తరగతులు అవసరం. సెకండ్ కౌన్సె లింగ్, స్పాట్ ద్వారా ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఆరు వారాలకు పైగా తరగతులు నష్టపోతున్నారు. శివారు ప్రాంతాలలో ఉన్న కళాశాలలో లెక్కకు ప్రొఫెసర్లున్నా, అర్హులు తక్కువే. ఇన్ని కష్టాల మధ్య విద్యార్థులు గట్టెక్కే పరిస్థితులు కల్పించని ప్రభుత్వం వారికి ఫీజు లివ్వమంటూ భయభ్రాంతులకు గురిచేయడం దారుణమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పేదలంటే సర్కారుకు చులకనా...
ఫీజుల భారాన్ని విద్యార్థులపై మోపేందుకు సర్కారు కుట్ర పన్నుతోంది. పేద కుటుంబాల పిల్లలకు ఆశాదీపమైన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ తీరుపై విద్యార్థులు నిప్పులు చెరుగుతున్నారు. అర్హత కలిగిన ఏ విద్యార్థీ డబ్బు లేదని ఉన్నత విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
ఆ యన ఆశయాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న స ర్కార్ వైఖరిని విద్యార్థులు ఖండిస్తున్నారు. పేద కుటుంబాల పిల్లలు సాంకేతిక, ఉన్నత చదువులకు అర్హులు కాకూడదా? ఉన్నత ఉద్యోగాలు ధనవంతుల పిల్లలే చేయాలా? అని ప్రశ్నిస్తున్నారు. డబ్బు లేకపోతేనేం తమకు అన్ని అర్హతలు ఉన్నాయంటున్నారు. పథకాన్ని ఎత్తివేస్తే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.
ఈ పథకం వల్లే నా బిడ్డ చదువుతున్నాడు
ఫీజ్ రీయింబర్స్‌మెం ట్ పథకం మావంటి పేదకుటుంబాలకు వరం. లక్షల్లో ఇంజనీరింగ్ ఫీజులు కట్టే స్థోమత లేని మాబోటి వారికి దారి చూపింది. మా బిడ్డ ఫైనల్ ఇయర్ వరకు వచ్చాడంటే అది రీయింబర్స్‌మెంట్ చలవే.
-ఎల్లయ్య, పేరెంట్
ప్రభుత్వ చేతకానితనమే
విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని కళాశాలలకు అనుమతులు మంజూరు చేయాల్సిన ప్రభుత్వం ఆమాటే మరిచింది. గతేడాది లక్షకు పైగా సీట్లు మిగిలిపోతే.. ఈ ఏడాది మరో లక్ష సీట్లు పెరిగేలా కళాశాలలకు అనుమతిచ్చింది. ఇది నిజంగా సర్కారు చేతగానీతనమే. మూడు శాతం ఉత్తీర్ణత కూడా సాధించని కళాశాలలను, పట్టుమని పది మంది విద్యార్థులు కూడా లేని కళాశాలలను మూసేయాలి. నాణ్యమైన విద్యను అందించడంలో విఫలమైన ప్రభుత్వం, పేదల చదువుకు ఆంక్షలు పెట్టడం విడ్డూరంగా ఉంది.
-లలిత్‌కుమార్,
ఐఐటీ-జేఈఈ ఫోరం కన్వీనర్
వైఎస్‌ఆర్ దయతోనే...
వ్యవసాయంపై ఆధారపడిన మా కుటుంబం ఇంజినీరింగ్ చదివించే స్థితిలో లేదు. వైఎస్‌ఆర్ దయతో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ద్వారా ఇంజినీరింగ్ చేస్తున్నా. ఈ పథకాన్ని తీసేస్తే నాలాంటి పేద విద్యార్థులు రోడ్డున పడతారు.
-అనిల్, చివరి సంవత్సరం విద్యార్థి
చదువుకు దూరవుతానని భయపడ్డా...
పెద్ద చదువు చదివే ఆశ వున్నా అప్పట్లో నాకు ఆ అవకాశం లేదు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పథకం తో నాకు ఇంజనీరింగ్ చదివే భాగ్యం కలిగింది. ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తామనటం సమంజసం కాదు.
- ప్రణయి, చివరి సంవత్సరం విద్యార్థి
ఫీజ్ రీయింబర్స్‌మెంట్ రద్దు సరికాదు...
ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నమ్ముకుని నావంటి విద్యార్థులెంతోమంది సాంకేతిక చదువులకు దగ్గరయ్యారు. ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేస్తే ఉన్నత చదువులు ఇకపై పేద, మధ్య తరగతి వర్గాలకు దూరం అయినట్లే.
-లోహిత్ కుమార్, ద్వితీయ సంవత్సరం విద్యార్థి
మహిళా సమాజానికి ఓ వరం:
మహిళలు విద్యార్థి దశ నుంచే అభివద్ధి చెందాలంటే ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం. అలాంటిదే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పథకం. దీంతోనే నేను ఇంజనీరింగ్ చదువు కోగలుగుతున్నా. దీన్ని రద్దు చేస్తే సహించేది లేదు.
-ఎం.లావణ్య, ద్వితీయ సంవత్సరం విద్యార్థి
Subscribe to:
Posts (Atom)