వైఎస్‌ఆర్‌సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శోభా నాగిరెడ్డి
కర్నూలు, న్యూస్‌లైన్: చంద్రబాబు నాయుడు రాసిన స్క్రిప్టుతో వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌పై మాజీ స్పీకర్ యనమల రామక్రిష్ణుడు దిగజారుడు మాటలు మాట్లాడటం తగదని వైఎస్‌ఆర్‌సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ భూమా శోభా నాగిరెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యవర్గ సమావేశం అనంతరం శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంచల్‌గూడ జైలులోని జగన్‌మోహన్‌రెడ్డి ములాఖత్‌ల పేరిట రాజకీయాలు చేస్తున్నారని విమర్శించడం, ఫోన్లలో మాట్లాడుతున్నారని చెప్పడం చూస్తుంటే టీడీపీ నాయకులు ఎంత దిగజారారో అర్థమవుతోందన్నారు. ఓ వైపు చంద్రబాబు పాదయాత్రలు చేస్తుంటే మరో వైపు ఆ పార్టీ నాయకులు పార్టీని వీడుతున్నారన్నారు. తెలుగుదేశం నాయకులపై అనుమానాలుంటే పార్టీ ఆఫీసులో పెట్టి తాళాలు వేసుకోవాలని సూచించారు. వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. పార్టీ ఉనికి కోసం బాబు పాదయాత్రలు చేస్తున్న విషయం ప్రజలకు తెలియనిది కాదన్నారు. అధికార పక్షం, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం కుమ్మక్కవడం వల్లే షర్మిల పాదయాత్రలు చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమ న కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రజా ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు.
వచ్చే నెల 6న జిల్లాలో షర్మిల పాదయాత్ర
కర్నూలు జిల్లాలో వచ్చే నెల 6వ తేదీ నుంచి షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభమవుతుందని భూమా నాగిరెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలోని కసాపురం నుండి కర్నూలు జిల్లా మద్దికెరలోకి షర్మిల ప్రవేశిస్తారన్నారు. అక్కడి నుండి పత్తికొండ మీదుగా ఆలూరు, ఆదోని, మంత్రాలయం, కోడుమూరు, కర్నూలు నియోజకవర్గం నుంచి మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్‌లో ప్రవేశిస్తారని వెల్లడించారు.

No comments:
Post a Comment