హైదరాబాద్: మన రాష్ట్రంలో తొమ్మిది సిలెండర్లను కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏడాదికి తొమ్మిది సిలిండర్లు ఇస్తున్నారు అని అంబటి అన్నారు.
సోనియా ఆదేశించినా.. కిరణ్ ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రం నుంచి 33 మంది ఎంపీలను గెలిపించినందుకు ప్రజలకు ఇచ్చిన వరమా ఇది అని సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా అందరికీ 9 సిలిండర్లు ఇవ్వాలని వైఎస్ఆర్ సీపీ కోరుతోందని అంబటి అన్నారు.
ప్రభుత్వ హాస్టల్‌లో గ్యాస్ కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, హాస్టళ్లకు అవసరమైన సిలిండర్లను సబ్సిడీపై ప్రభుత్వం ఇవ్వాలని ఆయన సూచించారు. చంద్రబాబు కోరుకుంటున్నందే మన రాష్ట్రంలో అమలు అమలవుతుందని అన్నారు. రుణమాఫీ అంటూ ప్రజలను చంద్రబాబు మభ్య పెడుతున్నారని అంబటి విమర్శించారు. |
No comments:
Post a Comment