షర్మిల పాదయాత్ర ఆదివారం రాప్తాడు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు ఎస్కే యూనివర్సిటీ వద్ద బహిరంగసభలో షర్మిల ప్రసంగిస్తారని చెప్పా రు. శనివారం ఆయన అనంతపురంలోని తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. కర్ణాటకలోని పావగడ, బాగేపల్లి నుంచి వెయ్యి ద్విచక్ర వాహనాల్లో రెండువేల మంది యువకులు కందుకూరుకు తరలివచ్చి షర్మిలకు ఘనస్వాగతం పలకనున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని మహిళలు వైఎస్సార్‌సీపీ జెండా నమూనాతో తయారు చేసిన చీరలను ధరించి షర్మిలకు హారతులు పట్టనున్నట్లు చెప్పారు.
పాదయాత్ర, బహిరంగసభకు నియోజకవర్గంతో పాటు జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పాదయాత్రకు హాజరయ్యే వారికి భోజనంతోపాటు 50వేల మంచి నీళ్ల ప్యాకెట్లు, 20 వేల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీకి సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్, ఆపార్టీతో అంటకాగుతున్న టీడీపీ చర్యలకు నిరసనగా వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రతి కార్యకర్తా నల్ల బ్యాడ్జీ ధ రించి పాదయాత్రకు హాజరుకావాలన్నారు. చంద్రబాబు అధికార దాహంతో ‘వస్తున్నా.. మీ కోసం’ అంటూ బోగ స్ యాత్ర చేస్తున్నారని ప్రకాష్‌రెడ్డి ఎద్దేవా చేశారు. పుట్టెడు కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు మేమున్నాం అని ధైర్యం చెప్పడానికి షర్మిల పాదయాత్ర చేస్తున్నారని వివరించారు.
source:sakshi

No comments:
Post a Comment