15 వేల కోట్ల రూపాయల విద్యుత్ సర్‌చార్జీలు పెంచినందుకా?
మీ హయాంలో గ్రామాలను శ్మశానాలుగా మార్చినందుకా?
బాబు తన పాలనలో పల్లెలను శ్మశానాలుగా మార్చారు
ఇప్పుడు అవే గ్రామాల గుండా పాదయాత్రలు చేస్తున్నారు
ప్రజల కాళ్లు పట్టుకున్నా ఆయన పాపం పోదేమో
15 లక్షల ఉద్యోగాలిస్తామన్న సీఎం.. ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారు
మీకు ఒక్కరోజు కూడా పాలించే అర్హత ఉందా అని అడుగుతున్నా
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 9, కిలోమీటర్లు: 130.9
మరో ప్రజాప్రస్థానం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: అడ్డగోలుగా చార్జీలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్న సర్కారుపై, అవిశ్వాస తీర్మానం పెట్టకుండా ప్రభుత్వానికి అన్ని విధాలా అండగా నిలుస్తూ పాదయాత్ర పేరుతో డ్రామాలాడుతున్న టీడీపీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. ప్రజలకు ఏం చేశారని ఇందిరమ్మ బాట పేరుతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. ‘వస్తున్నా మీకోసం’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యాత్రలు చేస్తున్నారని ప్రశ్నించారు.
‘‘ముఖ్యమంత్రి గారూ.. ఏం ఘనకార్యం చేశారని ఇందిరమ్మ బాట పట్టారు మీరు? 15 వేల కోట్ల విద్యుత్తు సర్‌చార్జీల భారం ప్రజలపై వేసి పెద్ద ఘనకార్యం చేశామని చెప్పుకోవడానికా? లేక మూడు సార్లు బస్ చార్జీలు పెంచినందుకా..?’’ అని విజయమ్మ నిలదీశారు. ‘‘చంద్రబాబు పాదయాత్ర అంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారు. తన హయాంలో శ్మశానాలుగా మార్చిన గ్రామాల గుండా ఆయనే ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు. ఆ ప్రజల కాళ్లు పట్టుకొని క్షమాపణలు అడిగినా ఆయన పాపం పోదేమో అనిపిస్తుంది’’ అంటూ షర్మిల మండిపడ్డారు. మరో ప్రజాప్రస్థానం తొమ్మిదో రోజైన శుక్రవారం అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన బహిరంగ సభలో షర్మిల, విజయమ్మ మాట్లాడుతూ.. పాలక, ప్రతిపక్షాల తీరును కడిగిపారేశారు. పెద్దఎత్తున పోటెత్తిన జనాన్ని ఉద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు. వారేమన్నారో వారి మాటల్లోనే..
బాబూ... ఈ డ్రామాలెందుకు?: షర్మిల
ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలని చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది అసాధ్యం. ప్రజలకు ఆయన చరిత్ర తెలుసు. ఇప్పుడు చేస్తున్న కుమ్మక్కు రాజకీయాలూ తెలుసు. అసలు ఆయన కు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉందా? తన హయాంలో శ్మశానాలుగా మార్చిన గ్రామాల గుండా ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు. నేరుగా ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి కాంగ్రెస్ పార్టీని దించేయకుండా ఈ డ్రామాలు ఎందుకు? వారి లక్ష్యమొక్కటే. ఈ రాష్ట్రంలో రెండే పార్టీలు ఉండాలి. మరో పార్టీ ఉండకూడదు. బాబు హయాంలో 9 సార్లు కరెంటు చార్జీలు పెరిగాయి. రైతులు కరువు కోరల్లో చిక్కుకుని అప్పుల్లో మునిగారు. కానీ చంద్రబాబు మాత్రం బిల్లులు కట్టాలని వేధించారు. కేసులు పెట్టారు. అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు రెండుసార్లు శిలాఫలకం వేసి వదిలేసిన హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.4 వేల కోట్లు వెచ్చించి 95 శాతం పూర్తిచే శారు. కానీ ఈ ప్రభుత్వం ఆ 5 శాతం పనులను మూడేళ్లలో పూర్తిచేయలేకపోయింది. వైఎస్ ఉన్నప్పుడు పెన్నా రిజర్వాయర్‌కు 10 టీఎంసీల నీటిని తెచ్చి ప్రజలను రక్షించాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భూగర్భ జలాలు పడిపోయాయి. తాగునీరు కూడా లేదు. ఏం తిని బతకాలని రైతన్న అడుగుతున్నాడు. వీటికి సర్కారే సమాధానం చెప్పాలి. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు కిరణ్‌తో పోటీపడి నిద్రపోతున్నారు. ఈ కుమ్మక్కు రాజకీయాలు ఎంతో కాలం సాగవు. దేవుడున్నాడు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్నను కూడా ఎవరూ ఆపలేరు.
సిలిండర్ల ధర వెయ్యి చేస్తున్నామని చెబుతారా: విజయమ్మ
సీఎం గారూ.. ఏం ఘన కార్యం చేశారని ఇందిరమ్మ బాట పట్టారు? అన్ని ధరలు పెంచి ఘనకార్యం చేశామని చెప్పుకొంటారా? సిలిండర్ల ధర వెయ్యి రూపాయల వరకు చేస్తున్నామని చెప్పుకోవడానికి వెళుతున్నారా? కనీసం 7 గంటలు ఉచిత విద్యుత్తు ఇవ్వాల్సిన చోట రెండు గంటలు కూడా ఇవ్వలేకపోతున్నామని చెప్పుకోవడానికా? ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చినందుకా? 108లో డీజిల్ కూడా లేదని చెప్పుకోవడానికా? 15 లక్షల ఉద్యోగాలిస్తామన్నారే.. నెలకు 15 రోజుల పాటు పరిశ్రమలకు విద్యుత్ సెలవు ఇచ్చి 25 లక్షల మందిని రోడ్డు పాలుచేశారేం? వారందరికీ ఉద్యోగాలిస్తారా? 104 ఉద్యోగులనే వదిలించుకున్నారు. మీరు 15 లక్షల ఉద్యోగాలిస్తారా? 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి 6 నెలలైంది.. ఏవీ? రైతులకు వడ్డీ లేని రుణాలని ఆగస్టులో చెప్పారు? ఏమైంది. ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు? ఒక్క రోజు కూడా మీకు పాలించడానికి అర్హత ఉందా అని ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేస్తారట. ఆయన హయాంలో రైతులు కరువు కోరల్లో విలవిల్లాడుతుంటే ఎందుకు చేయలేదు? నేతన్న పరిస్థితి దారుణంగా తయారైంది. ముడి సరుకు ధర బాగా పెరిగింది. కానీ పట్టు చీరల ధర మాత్రం 10 శాతం మించి పెరగలేదట. నేతన్నల కోసం వైఎస్‌లా పరితపిస్తున్న నాయకుడు జగన్ ఒక్కడే. వారి కోసం 2010లో మహాధర్నా చేశారు. 2011లో 103 డిగ్రీల జ్వరంలోనూ దీక్ష చేశాడు. జగన్ అధికారంలోకి వస్తే ప్రభుత్వమే నూలు సరఫరాచేస్తుంది. కుటుంబానికి కాకుండా మగ్గం యూనిట్‌గా సబ్సిడీ ఇస్తుంది.

No comments:
Post a Comment