పెదవాల్తేరు (విశాఖపట్నం), న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడానికి పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ అదీప్‌రాజు వెబ్‌సైట్‌ను రూపొందించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల రాష్ట్ర సమన్వయకర్త కొణతాల రామకృష్ణ బీచ్‌రోడ్డులోని తమ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ షర్మిల చేపట్టిన పాదయాత్రకు రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. పాదయాత్రలో పాల్గొన లేకపోయిన వైఎస్ అభిమానులు, ఆ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ వెబ్‌సైట్ దోహదపడుతుందన్నారు.
www.maroprajaaprasthanam.com లో పాదయాత్ర పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని అదీప్‌రాజు చెప్పారు.
www.maroprajaaprasthanam.com లో పాదయాత్ర పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని అదీప్‌రాజు చెప్పారు.
No comments:
Post a Comment