కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలపై షర్మిల మండిపడ్డారు. చంద్రబాబు చీకట్లో చిదంబరాన్ని కలిసి తనపై విచారణ జరగకుండా ఆపగలిగారని ఆమె అన్నారు. ఆరోరోజు పాదయాత్రలో భాగంగా షర్మిల కర్ణపల్లిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. పాలక, ప్రతిపక్షాల కుయుక్తులను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రెండు పార్టీలు కుట్రలతో జగన్ ను అన్యాయంగా జైల్లో పెట్టించారని షర్మిల అన్నారు.
మహానేత వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ప్రభుత్వం పేద విద్యార్థులకు అందకుండా చేస్తోందని షర్మిల ఆరోపించారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలన్న ఉద్దేశంతో ప్రవేవపెట్టిన పథకానికి సర్కార్ తూట్లు పొడుస్తోందని ఆమె ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ప్రభుత్వం కనీసం ఇన్ పుట్ సబ్సిడీ కూడా ఇవ్వటం లేదని మండిపడ్డారు.

No comments:
Post a Comment