తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రను కాపీ చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల జాతీయ మీడియా ఎన్డీటివితో అన్నారు. వైయస్ పాదయాత్రను ఎద్దేవా చేసిన బాబు ఇప్పుడు ఆయననే అనుకరిస్తున్నారన్నారు. అప్పట్లో వైయస్ ఇచ్చిన హామీలపై విమర్శలు గుప్పించి ఇప్పుడు అవే హామీలు ఇస్తున్నారన్నారు.
ఉచిత్ విద్యుత్, ఆరోగ్యశ్రీ, రుణమాఫీ అంటూ ఇప్పుడు వైయస్ నాడు ఇచ్చిన హామీలనే ఇప్పుడు ఇస్తున్నారన్నారు. తన మరో ప్రజా ప్రస్థానం యాత్రకు బాబు వస్తున్నా మీకోసం యాత్రకు పోలిక లేదని, జగన్ అరెస్టును నిరసిస్తూనే తాను నల్ల బ్యాడ్జి ధరించి పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు. బాబు అధికారంలో ఉండగా ఒక్క రైతు రుణమైనా మాఫి చేశారని అని షర్మిల సోమవారం ప్రశ్నించారు. రైతులపై కేసులు పెట్టిన ఘనత ఆయనది అన్నారు.
బాబు హయాంలో కరవు కరాళ నృత్యం చేసిందని, తాను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే బాబు రైతుల కోసం, చేనేత కార్మికుల కోసం చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెసు, టిడిపిలు కలిసి తన సోదరుడిని జైల్లో పెట్టించాయని ఆరోపించారు. కిరణ్ సర్కారుకు, బాబు సర్కారుకు తేడా లేదని, జగన్‌కు బెయిల్ రాకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు అందుకోసం సిబిఐని పావుగా ఉపయోగించుకుంటున్నాయని విమర్శించారు.
సుప్రీం కోర్టులో జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే ఒక్కరోజు ముందు టిడిపి ఎంపీలు కేంద్రమంత్రి చిదంబరాన్ని ఎందుకు కలిశారో చెప్పాలన్నారు. జగన్ పైన కక్షతోనే సాక్షి ఆస్తుల్ని అటాచ్ చేయాలంటూ ఈడిని ఆదేశించారన్నారు. కాగా షర్మిల పాదయాత్ర ఈ రోజు మధ్యాహ్నం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనుంది.

No comments:
Post a Comment