అనంతపురం, న్యూస్‌లైన్: వైఎస్ జగన్ తరఫున సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర దసరా పండుగ రోజు బుధవారం అనంతపురం జిల్లాలో కొనసాగుతుందని ప్రోగ్రా మ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎం.శంకరనారాయణ మంగళవారం తెలిపారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే పాదయాత్ర తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి, పెదకోట్ల, తాడిమర్రి, శివంపల్లి మీదుగా సాగనుంది. రాత్రి శివంపల్లికి 2.2 కి.మీ. దూరంలో రోడ్డు పక్కన వేసిన గుడారాల్లో షర్మిల బస చేయనున్నారు. బుధవారం 15 కి.మీ. మేర పాదయాత్ర సాగనుంది. గురువారం ఆత్మకూరు, తమ్మాపురం, సుబ్బరావుపేట క్రాస్, తుమ్మలక్రాస్ మీదుగా దాదాపు 14 కి.మీ. మేర పాదయాత్ర సాగనుంది. తుమ్మలక్రాస్ శివార్లలో రాత్రికి బస చేస్తారు.
source:sakshi
source:sakshi
No comments:
Post a Comment