అనంతపురం: మరో ప్రజాప్రస్థానం పేరిట షర్మిల చేస్తున్న పాదయాత్ర మరికాసేపట్లో ధర్మవరం చేరుకోనుంది. తుమ్మల క్రాస్ నుంచి శుక్రవారం అశేష జనవాహిని మద్దతుతో ప్రారంభమైన పాదయాత్ర మల్లేనిపల్లి వద్ద కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఓ రైతు షర్మిలను తన పొలంలో విత్తనాలు వేయాలని కోరడంతో అందుకు ఆమె అంగీకరించారు. అనంతరం రాజన్న పాలనకు, ఇప్పటి ప్రభుత్వ పాలనకు తేడా ఏంటని అడగడంతో రైతులు కరెంట్ కోతలు, విత్తనాల కొరత తదితర సమస్యలను ప్రస్తుతం ఎదుర్కొంటున్నామని చెప్పారు.
మరోవైపు ధర్మవరంలో కేబుల్ ప్రసారాలు నిలిపివేసినట్టు తెలుస్తోంది. అంతేకాక ఉదయం నుంచి కరెంట్ సరఫరాను కూడా నిలిపివేశారని సమాచారం. షర్మిల చేపట్టిన పాదయాత్రకు సంబంధించి వివరాలను వైఎస్ అభిమానులు తెలుసుకోకుండా ఉండేందుకే కాంగ్రెస్ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

No comments:
Post a Comment