ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఆదరిస్తున్న తీరు, షర్మిల 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రకు వస్తున్న ఆదరణ బట్టి రానున్న కాలంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం తప్పదని స్పష్టమవుతోంది. జగన్ ప్రభంజనాన్ని తట్టుకోలేక కాంగ్రెస్, తెలుగుదేశం, సీబీఐలు ఒక్కటయ్యారని ప్రజల గొంతుక ఒక్కటై కూస్తోందనేది వాస్తవం. రాష్టంలో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ సాధించిన ఘనవిజయం ప్రజల్లో విశ్వాసాన్ని, భరోసాని నింపింది. రానున్నది రాజన్న రాజ్యమేనని ప్రజలు ఎదురు చూస్తున్నారని రాష్టంలో ముఖచిత్రం స్పష్టంగా కనిపిస్తొంది.
ఎన్ని శక్తులు ఏకమైనా రాష్ట్రంలో యువనేత జగన్ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని.. కాంగ్రెస్ టీడీపీలు కుమ్మక్కైనా గత ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అందుకు నిదర్శనమని వైఎస్ఆర్ సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కానీ.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజల కష్టాలు ప్రభుత్వానికి తెలియజేయాలనే లక్ష్యంతో పాటు.. భవిష్యత్తులో స్వర్ణయుగం సాకారం కానుందనే భరోసా ఇస్తూ చేయాలనుకున్న మరో ప్రస్థానం పాదయాత్రను.. తొలుత జగన్‌మోహనరెడ్డి చేయాలని యోచించారు. ప్రజల్లో తిరుగుతున్నారన్న ఒక్క కారణంతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై జైల్లో పెట్టించడంతో అన్న ఆశయాన్ని ప్రస్తుతం షర్మిల ముందుకు తీసుకువెళ్తున్నారు. షర్మిల పాదయాత్రకు వస్తున్న ఆరదణ చూస్తుంటే.. జగన్ పై విశ్వాసంతోనే గత రెండు ఎన్నికల్లోనూ వైఎస్‌ను చూసే జనం ఓట్లేశారని, సోనియాను చూసి కాదన్న విషయం కాంగ్రెస్‌నాయకులకు ఇప్పుడిప్పుడే బోధపడుతోంది.
రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు సాగునీరందించే పోలవరం వంటి ప్రాజెక్టులకు వైఎస్ శ్రీకారం చుడితే వాటిని ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తొంది. రాష్ట్రంలో పలు ప్రాజెక్టులను, పథకాలను చేపట్టలేమని ప్రభుత్వం ఎప్పుడో చేతులెత్తేసింది. వైఎస్ హయాంలో అన్నివర్గాలవారికీ న్యాయం జరిగిందనీ, ప్రస్తుతం ప్రభుత్వం ఉందా అన్న అనుమానం ప్రజల్లో బలంగా నాటుకుపోతోంది. ప్రజాసమస్యలపై పోరాటం చేయడమే లక్ష్యంగా జగన్‌మోహనరెడ్డి పార్టీని ముందుకు నడిపిస్తున్న తీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. ప్రజల్ని మభ్యపెట్టడానికి చంద్రబాబు తెరలేపిన పాదయాత్రను, ఆయన చేస్తున్న అమలు కాని వాగ్దానాలను జనం నమ్మడం కష్టమేనని ఆపార్టీకి చెందిన నేతల్లో అనుమానాలున్నాయి.
తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు పనితీరు.. కాంగ్రెస్తో ఆడుతున్న నాటకాన్ని జనం చూస్తున్నారు. జగనన్న ఆశయంతో పాదయాత్ర చేస్తూ జనంలోకి వచ్చిన షర్మిలకు ప్రజలు బ్రహ్మరధం పడుతూ.. అక్కున చేర్చుకోవడం చూస్తే రానున్నది జగన్ ప్రభంజనం..రాజన్న రాజ్యమేనని ప్రజల కళ్లలో ఆశలు చిగురిస్తున్నాయనడంలో సందేహం అక్కర్లేదు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన ప్రజానాయకుడు వై.ఎస్.రాజశేఖరరెడ్డి అయితే ఆయన తనయుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తన కంటిచూపుతో ప్రజావిప్లవం తేగల యువనాయకుడని వైఎస్ఆర్ సీపీ నేత కొణతాల రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు వాస్తవ రూపం దాల్చడానికి మరి ఎంతో దూరం లేదని అనిపిస్తోంది.
No comments:
Post a Comment