అనంతపురం: జిల్లాలో షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర తంబాపురం చేరుకుంది. ఈ సందర్భంగా హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరని, అలాగే ప్రజా సేవకు పరితపించే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. రానున్న కాలంలో జగన్ జైలునుంచి బయటికి వచ్చి ప్రజలకు రాజన్న రాజ్యాన్ని అందించడం ఖాయమని అమె అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ముందుండేందుకు నిర్ణయించుకున్న జగన్ ను అణిచి వేసేందుకు పాలక ప్రతిపక్షాలు చేస్తున్నకుట్రలను ఆమె ఎండగట్టారు. ఈ కుట్రలకు నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. |
Thursday, 25 October 2012
రాజన్న రాజ్యం ఖాయం: షర్మిల
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment