వైఎస్సార్ జిల్లా నుంచి ‘అనంత’లోకి పాదయాత్ర
‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్ తనయ, జగన్ సోదరి, వైఎస్సార్ జిల్లా ఆడపడుచు షర్మిలకు ఆ జిల్లా ప్రజలు జిల్లా సరిహద్దుల్లో ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. మంగళవారం పార్నపల్లిలో బహిరంగ సభతో జిల్లాలో యాత్ర పూర్తయింది. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అక్కడి వంతెన దాటే సమయంలో జిల్లా మహిళలు షర్మిలకు గాజులు, కుంకుమ, పూలతో సాంప్రదాయకంగా వీడ్కోలు పలికారు. జిల్లా ప్రజలు ఆదరించిన తీరుకు షర్మిల శిరస్సు వంచి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఐదున్నర రోజుల్లో 82.5 కిలోమీటర్లు పాదయాత్ర సాగింది.
అక్కున చేర్చుకున్న అనంత: మంగళవారం సాయంత్రం అనంతపురం జిల్లాకు చేరుకున్న మరో ప్రజాప్రస్థానానికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికి షర్మిలను అక్కున చేర్చుకున్నారు. దాదాపు 10 వేల మంది ప్రజలు సరిహద్దులోకి వచ్చి స్వాగతం పలికారు. యాత్ర ప్రవేశించిన దాడితోట నుంచి షర్మిల బసచేసిన ప్రాంతం వరకు జనం బారులు తీరి ఆత్మీయంగా ఆదరించారు. జిల్లా ఎమ్మెల్యేలు గురునాథ్‌రెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు.
పాదయాత్రలో ఎమ్మెల్యేలు: వైఎస్సార్ జిల్లాలో ఐదున్నర రోజులు 82.5 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ వీలైనప్పుడల్లా ఐదు రోజుల పాటు పాదయాత్రలో పాల్గొనగా.. పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి పూర్తిస్థాయిలో పాదయాత్రలో కొనసాగుతున్నారు. వైఎస్సార్ జిల్లా ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, కె.శ్రీనివాసులు పూర్తిస్థాయిలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ డి.నారాయణరెడ్డి కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. ఇక పొరుగు జిల్లాల నుంచి పలువురు శాసనసభ్యులు యాత్రలో ఒకటి రెండు రోజులు నడిచారు. వీరిలో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, శోభానాగిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, గురునాథ్‌రెడ్డి, ప్రసన్నకుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి రెండు రోజులు పాదయాత్రలో నడిచారు. ఎమ్మెల్యే కాపు రాంచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి మొదటి నుంచీ నడుస్తున్నారు. ఎమ్మెల్సీలు శేషుబాబు, దేశాయి తిప్పారెడ్డి తదితరులు వైఎస్సార్ జిల్లాలో పాదయాత్రలో పాల్గొన్నారు. మాజీ మంత్రి కొండాసురేఖ, పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, కేకే మహేందర్‌రెడ్డి తదితరులు తొలి మూడురోజులు యాత్రలో పాల్గొన్నారు.
source:sakshi

No comments:
Post a Comment