అనంతపురం: టిడిపి అధ్యక్షుడు చంద్ర బాబు హయాంలో రైతులు, చేనేత కార్మికుల బతుకులు చిధ్రమైయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే విజయమ్మ అన్నారు. ధర్మవరంలో ఈ సాయంత్రం జరిగిన మహాప్రస్థానం భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. చంద్రబాబు హయాంలో ఆప్కో దుస్థితిని ఆమె గుర్తు చేశారు.
ధర్మవరంలో చేనేత బతుకులు చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి, చేనేత వస్త్రానికి మద్దతు ధర లేదని అమె అన్నారు. నూలు, మగ్గం, షెడ్డు సౌకర్యాలు కల్పిస్తామని వైఎస్ఆర్ హామీ ఇచ్చారన్నారు. అధికారులు కూడా వారంలో ఒకసారి చేనేత వస్త్రాలు ధరించాలని వైఎస్ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ హామీలను ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. అనంత రైతులకు గతంలో ఉన్న 32 టీఎంసీల నీటిని ఇప్పుడు 23 టీఎంసీలకు కుదించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తాగునీటి పథకాలన్నీ దిష్టిబొమ్మల్లా తయారయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో పంటలకు, తాగడానికి నీరు లేని దుస్థితి నెలకొందన్నారు. అప్పుడు వైఎస్ఆర్, ఇప్పుడు జగన్ ప్రజల మధ్యలో ఉండి వారి కష్టాలు తెలుసుకుంటున్నారని చెప్పారు. 12 వేల కోట్ల రూపాయల రుణమాఫీలో అనంతపురం జిల్లా వాటాగా 555 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. చంద్రబాబు హయాంలో రైతులకు 90 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, వైఎస్ఆర్ హయాంలో 900 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆమె చెప్పారు.
source:sakshi

No comments:
Post a Comment