హైదరాబాద్: షర్మిల చేపట్టిన పాదయాత్రను చూసి టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో గట్టు రామచంద్రరావు మాట్లాడుతూ.. చంద్రబాబుకు చిన్నమెదడు చిట్లి పోయింది అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ టీడీపీకి బ్రాంచ్ ఆఫీసుగా మారిందని గట్టు విమర్శించారు. టీడీపీ నేత యనమల రామకృష్ణుడు నోటికొచ్చినట్లు అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు. అంతేకాక టీడీపీ మునిగిపోతున్న పడవ అని గట్టు అన్నారు.
వైఎస్ జగన్ జైల్లో సెల్‌ఫోన్ వాడుతున్నారని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను గట్టు తప్పు పట్టారు. అయితే సెల్ ఫోన్ వాడుతున్నారంటూ టీడీపీ నేతలు చేసిన ఆరోపణలకు రుజువులు చూపాలని ఆయన డిమాండ్ చేశారు. యనమల సహా టీడీపీ నేతలు జైలు కెళ్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని గట్టు హెచ్చరించారు.
source:sakshi

No comments:
Post a Comment