రామోజీరావు కుమారుడు సుమన్ మృతిపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ సంతాపం తెలిపింది. రచయితగా, చిత్రకారుడిగా, నటుడిగా, ఈటీవీ డైరెక్టర్ గా తెలుగు టీవీ ప్రేక్షకులకు సుమన్ సుపరిచితులని పార్టీ పేర్కొంది. చిన్నవయసులోనే సుమన్ కన్నుమూయటం బాధాకరమని తెలిపింది. సుమన్ సతీమణి విజయేశ్వరి, పిల్లలు, రామోజీరావు, కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ సానూభూతి వెల్లడించింది.
ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు రెండవ కుమారుడు, ఉషోదయా ఎంటర్ ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ సుమన్ అర్థరాత్రి కన్నుమూశారు. ఆయన కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 45 సంవత్సరాలు. సమన్‌కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. 1966 డిసెంబరులో జన్మించిన సుమన్ జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు.
ఉషోదయా ఎంటర్ ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తూ ఈటీవీ టెలీ ఫిలిమ్స్ లో నటించారు. కొన్ని మెగా సీరియల్స్‌కు దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ప్రఖ్యాత చిత్రకారుడు బాపూ దగ్గర సుమన్ శిష్యరికం చేశారు. సుమన్ అంత్యక్రియలు రామోజీ ఫిల్మ్ సిటీలో ఇవాళ జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.

No comments:
Post a Comment