ప్రజల కోసం చేపట్టిన పాదయాత్రను నల్లబ్యాడ్జీతో కొనసాగిస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. వైఎస్‌ఆర్, జగన్‌ను అభిమానించే వాళ్లంతా నల్లబ్యాడ్జీతో పాదయాత్రలో పాల్గొంటారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్‌కు బెయిల్ రాకుండా అడ్డుకునే కుట్ర జరుగుతోందని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. బెయిల్ వస్తుందనుకున్న ప్రతీసారి కొత్త ఛార్జీషీట్ వేస్తున్నారని ఆమె అన్నారు.
కేంద్రంలో చక్రం తిప్పామని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని ఎందుకు విస్మరించారని విజయమ్మ ప్రశ్నించారు. వ్యవస్థలను బాబు భ్రష్టు పట్టించారని ఆమె మండిపడ్డారు. మళ్లీ అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులను తొలగిస్తామంటున్న చంద్రబాబే వాటికి మూలమన్న విషయాన్ని మరిచిపోతున్నారని విజయమ్మ అన్నారు

No comments:
Post a Comment