రక్షణ స్టీల్స్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని బ్రదర్ అనిల్ కుమార్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గతంలోనే చాలా సార్లు స్పష్టం చేశానని ఆయన చెప్పారు. అయినా టీడీపీ సహా కొన్ని ఛానల్స్ తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న టీడీపీ, ఛానల్స్ పై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. రేపటి ఉపఎన్నికల కోసం తనపై ఈ దుష్ప్రచారం జరుగుతోందన్నారు. తమ కుటుంబాన్ని నిందిస్తే ఓట్లు పడతాయనే రాజకీయాలను చూసి జాలి పడుతున్నానన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment