YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 2 September 2012

రాష్ట్ర ప్రాజెక్టులు గోదాట్లో

NewsListandDetails
కేంద్రం గడియకో మాట, గంటకో పాట పాడుతోంది. అన్ని రకాల సాగునీటి ప్రాజెక్టుల అనుమతులపై హస్తిన పాలకులు మీనమేషాలు లెక్కపెడుతు న్నారు. ఇప్పుడేమో అసలుక్నే మోసం చేస్తున్నారు. అను మతులు, గినుమతులు జాన్తానహీ అంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉండటం మన రాష్ట్రం చేసుకున్న పాపమా? అధికారం పీఠం కోసం నోట్లో నాలిక లేనట్లుగా పడి ఉండే నాయకులు మన రాష్ట్రానికి ఏలికలు కావడం పాపమా? తరతరాలుగా రగులుతోన్న ప్రాంతీయ  విభే దాలు పరాకాష్టకు చేరుకుని, చివరికి ఢిల్లీలో సరైన రీతిలో ప్రాజెక్టులపై దౌత్యం చేయలేకపోవడం నేరమా? వెరశి మన ప్రాజెక్టులు మరోమారు అటకెక్కాయి. ప్రాణహిత.. చేవెళ్లకు జాతీయ హోదాపై కేంద్రం ససేమిరా అంది. సాగునీటి ప్రాజెక్టులపై ఉత్తరప్రదేశ్‌కు రెండింటికి అనుమలు జారీ చేసిన కేంద్రం రాష్ట్రానికి వచ్చేసరికి మొండిచేయి చూపింది. ఇదేమిటని అడిగిన పాపాన పోయిన నేతలు లేకపోవడం తెలుగుజాతి దురదృష్టం. జాతీయ హోదాలపై కేంద్రం తరచూ రెండు నాల్కల ధోరణినే అవలంభిస్తోంది. బెదిరించేవాడిదే బర్రె, అదిలించేవాడికే ప్రాజెక్టులనే రీతిలో కేంద్ర మంత్రులు వ్యవహరిస్తున్నారు. మన రాష్ట్రానికి చెందిన 33 మంది ఎంపీలు జరిగిన అన్యాయంపై నోరె త్తడం లేదు. కేంద్రం కొట్టిన గండితో మరోమారు మన రాష్ట్రపు నీటి ఆశలు ఆవిరయ్యాయి. కేంద్ర జలవనరుల మంత్రి పవన్‌ కుమార్‌ బన్సల్‌ జాతీయ హోదాలపై ఎట్టకేలకు నిగ్గుతేల్చారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రాజెక్టు లకు అనుమతి కుదరదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రాణహిత...చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టింది. జాతీయ హోదా కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం కేంద్రానికి ప్రతిపాదనలు పంపిం చింది. అయితే రెండేళ్లు పరిశీలనలు లేకుండానే పెండింగ్‌లో ఉంచిన కేంద్రం చివరికి వీలు కాదంది. అనేక శాఖల నుంచి క్లియరెన్స్‌లు రావాల్సి ఉందని ఇవి వస్తే కానీ ఏమీ  చేయలేమని కేంద్రం స్పష్టం చేయడం సవతి తల్లి ప్రేమకు తార్కాణంగా నిలిచింది. కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలబెట్టే విధంగా ఇక్కడి నుంచి 33 మంది కాంగ్రెస్‌ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ విధంగా కేంద్రం రాష్ట్రానికి, ఇక్కడి ప్రజలకు రుణపడి ఉండాలి. అయితే ఈ 33 మంది ఎంపీలు తమ సొంత అజెండాలు తప్ప, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎలాంటి ప్రయ త్నాలు చేయకపోవడంతో కథ అడ్డం తిరిగింది. పోలవరం ప్రాజెక్టు విషయంపై మరో కేంద్ర మంత్రి జయంతీ నట రాజన్‌ వివాదాస్పద సమాధానం చెప్పారు. దీనితో రాష్ట్ర ప్రయోజనాలు గోదాట్లో కలిసినట్లేనని, మన భవిష్యత్తు అంతా కృష్ణార్పణంగానే మారినట్లు భావిస్తున్నారు. ఎంపీలు లోపాయికారి వ్యవహారాలతో సొంత చక్రాలు తిప్పుతున్నారు. వారికి రాష్ట్ర ప్రయోజనాలు అంత కీలకం కాదనే విషయం కేంద్రం ధోరణి చూస్తే వెల్లడవుతుంది. ప్రజా ప్రయోజనాలపై స్పందించని ప్రతినిధులు ఇక ముందు ఏం ముఖం పెట్టుకుని ప్రజల వద్దకు వెళ్లుతారు. కేంద్రమంత్రి మండలిలో ఏదో ఒక పదవిని లేదా రాష్ట్రంలో పనులను చక్కదిద్దుకోవడానికి పైరవీలు సాగిస్తున్నారు తప్ప ప్రజల కోసం నోరెత్తడం లేదు. ఉద్వేగభరిత అంశాలపై స్పందించే ఎంపీలు ప్రజాహిత అంశాలపై ఢిల్లీలో ఎక్కడా ఎలాంటి హడావిడి చేయకపోవడం ప్రజల దౌర్భాగ్యం అనుకోవడంతప్ప మరోటి చేయలేకపోతున్నారు. ప్రాంతీయ విభేదాలను, అసమానతలను రూపుమాపేందుకు వీలైన ప్రాజెక్టులకు సరైన రీతిలో సకాలంలో అనుమతులు ఇవ్వ కుండా నాన్చడంతో  కేంద్రం పరోక్షంగా అన్ని ప్రాంతాల మధ్య జగడాలమారి పాత్ర పోషిస్తోంది. రాష్ట్ర ప్రయో జనాల విషయంలో తామేమీ చేయలేకపోతున్నా మని, ఇక్కడి కేంద్ర మంత్రులు, ఎంపీలు, సీనియర్‌ నేతలకు తెలుసు. కానీ తెలిసితెలిసి వారు ఏమీ చేయలేని చేతకాని స్థితిలోనే ఉన్నారు. ప్రాణహిత...చేవెళ్ల,, పోలవరం ప్రాజెక్టులకు జాతీయహోదా కల్పిస్తామని గతంలో ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు హామీ ఇచ్చారు. కానీ ఇది నెరవేర లేదు. రాజకీయంగా కాంగ్రెస్‌ను అన్ని కాలాలలోనూ ఆదు కున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల విషయంలో మీనమేషాలు లెక్కించే కేంద్రం, రాజకీయంగా ఎప్పుడూ చెంపదెబ్బలు తిన్పించే ఉత్తరప్రదేశ్‌పై మాత్రం అపార ప్రేమను ప్రదర్శిస్తోంది. రాహుల్‌, సోనియాలకు రాజకీయంగా కీలక మైన రాష్ట్రం కావడంతో ఉత్తరప్రదేశ్‌పై అమితానురాగాలు వ్యక్తం చేస్తోంది. అక్కడి ప్రాజెక్టులపై కనీస నివేదికలు ఇవ్వకపోయినా స్పందించిన కేంద్రం, ఇక్కడికి వచ్చేసరికి సవాలక్ష కొండీలు పెట్టి, ఆశలకు గండికొట్టడం ఏ న్యాయం అన్పించుకుంటుంది? రాష్ట్ర ప్రభుత్వం అందించిన నివేదిక లపై అనేక వివరణలు కోరుతున్నారు. అనేక కీలక అంశా లతో సతమతమవుతూ, కోర్టుల నుంచి మొట్టి కాయలు తింటోన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులపై సమగ్ర నివేది కను అందించగలదా? అనేది ధర్మసందేహమే. మంత్రుల అవినీతి భాగోతం, కాలేజీల ఫీజుల వ్యవహారాలు, ప్రత్యేక సీమల నినాదాలపై మీమాంసలు, తాజాగా తీవ్ర విద్యుత్‌ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న రాష్ట్ర సర్కారు సమగ్ర నివేదికను అందిస్తుందా? దానికి తదనంతర పరిణామంగా కేంద్రంవద్ద దౌత్యంనెరిపి కార్యాన్ని సానుకూలం చేస్తుందా? అనేది కీలక ప్రశ్నే. తమలో తమకు తగవులు మాని, ఎంప ీలంతా రాష్ట్ర ప్రయోజనాలపై శ్రమిస్తారా? అనేది శేషప్రశ్నే.
vaartha

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!