YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 2 September 2012

పెద్దాయనకు జన నివాళి


వాడవాడలా సంస్మరణ సభలు, ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో అన్నదానం, రక్తదానం, వైద్య శిబిరాలు
పావురాలగుట్ట వద్ద పార్టీ నేతల కన్నీటి నివాళి



న్యూస్‌లైన్ నెట్‌వర్క్: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి మూడో వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలు ఆయనకు అశ్రు నివాళులర్పించారు. పెద్దాయనను స్మరించుకుంటూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామగ్రామాన వైఎస్ సంస్మరణ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ విగ్రహాలకు పాలాభిషేకాలు జరిపారు. వాడవాడలా అన్నదానం, రక్తదానం, వైద్య శిబిరాలను నిర్వహించారు. పలు ప్రాంతాల్లో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు వైఎస్‌కు నివాళులు అర్పించారు.

పావురాల గుట్ట వద్ద..

వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ కూలిన పావురాలగుట్ట వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్య నేతలు వై.వి.సుబ్బారెడ్డి, ఎం.వి.మైసూరారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాపరెడ్డితో సహా పలువురు రాష్ట్ర నేతలు కన్నీటి నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ముఖ్య నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, కొణతాల రామకృష్ణ, సోమయాజులు తదితరులు మహానేత ను స్మరించుకున్నారు. సేవాదళ్ రాష్ట్ర కన్వీనర్ కోటింరెడ్డి వినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని, యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం మేకపాటి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత గత మూడేళ్లలో రాష్ర్టం అస్తవ్యస్తంగా తయారైందనీ, ఆయన జీవించి ఉన్నప్పటి పాలనకూ ఇప్పటికీ పోలికే లేకుండా పోయిందన్నారు.
వైఎస్ స్థానంలో వచ్చినవారు రాష్ట్రం కోసం ఏమీ చేయలేకపోతున్నారని, నాయకత్వ లక్షణాలున్నవారే లేరని అన్నారు. వైఎస్‌ను రాష్ట్ర ప్రజలు వందేళ్లు గుర్తుంచుకుంటారని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అటు అనంతపురంలో పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి, సీజీసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత, సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి తదితరులు మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లోని మసీదుల్లో ముస్లింలు అన్నదానాలు నిర్వహించారు. నెల్లూరులో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి మహిళలకు చీరలు, దుస్తులను పంపిణీ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో వాడవాడలా మహానేత సంస్మరణ సభలు నిర్వహించారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మహానేత వర్ధంతి సభలో అనకాపల్లి ఎంపీ సబ్బం హరి పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా సమనసలో డ్వాక్రా సంఘాల మహిళలు అన్నదానం జరిపారు. జిల్లాలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో పార్టీ నేతలు జక్కంపూడి విజయలక్ష్మి, జ్యోతుల నెహ్రూ, కుడుపూడి చిట్టబ్బాయి, ఇందుకూరి రామకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

అన్నదానం.. రక్తదాన శిబిరాల ఏర్పాటు..:వైఎస్ వర్ధంతి సందర్భంగా అటు గుంటూరు జిల్లావ్యాప్తంగా పార్టీ శ్రేణులు అన్నదానం, సంస్మరణ సభలు నిర్వహించాయి. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాలలో పార్టీ నేత జంగా కృష్ణమూర్తి, సత్తెనపల్లిలో అంబటి రాంబాబు, చిలకలూరిపేటలో జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ తదితర నేతలు మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, పేదలకు అన్నదానం చేశారు.

నగరిలో పార్టీ నేత ఆర్ కే రోజా, చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పుత్తూరులో జరిగిన కార్యక్రమాల్లో జిల్లా పార్టీ కన్వీనర్ నారాయణస్వామి పాల్గొన్నారు. మదనపల్లెలో ఎమ్మెల్సీ దేశాయితిప్పారెడ్డి ఆధ్వర్యంలో బధిరుల పాఠశాలల్లో అన్నదానం చేశారు. వైఎస్సార్ జిల్లాలో వాడవాడలా మహానేత విగ్రహాలకు పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేశారు. వేలాది మందికి అన్నదానం చేశారు. కర్నూలులో జిల్లా పార్టీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్‌కు ఘనంగా నివాళులర్పించారు. మంత్రాలయంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో జిల్లా కన్వీనర్ బోడ జనార్దన్ ఆధ్వర్యంలో వైఎస్‌కు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. వివిధ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు సోయం బాబూరావు, కోనేరు కోనప్ప తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్‌లో ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తెలంగాణ యూనివర్సిటీలో విద్యాప్రదాతకు విద్యార్థులు ఘన నివాళులర్పించారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో మహానేత వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు.

నల్లగొండలో పార్టీ జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి, పాలమూరులో జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో జిల్లా కన్వీనర్ బి.జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. అటు తూర్పు గోదావరి జిల్లాలో హోంశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి పినిపే విశ్వరూప్, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నివాళులు పాల్గొన్నారు. కర్నూలులో మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్మృతివనంలోని వైఎస్ విగ్రహానికి నివాళులు అర్పించారు. గుంటూరులో మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్ శ్రద్ధాంజలి 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!