ఇడుపులపాయ : కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాల్ని ఛేదించేందుకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల చేపట్టబోయే మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఆమెకు మద్దతు తెలిపేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు వైఎస్ఆర్ ఘాట్ చేరుకున్నారు. తండ్రి ఆశీస్సులను తీసుకునేందుకు షర్మిల వైఎస్ఆర్ ఘాట్ రానున్నారు. అనంతరం ఆమె ట్రిపుల్ ఐటీ విద్యార్థులను కలవనున్నారు. ఉదయం 11 గంటలకు షర్మిల పాదయాత్ర ప్రారంభిస్తారు. కాగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది.
మరోవైపు ఇడుపులపాయ రోడ్లు మహానేత వైఎస్ఆర్ భారీ కటౌట్లతో నిండిపోయాయి. 30 అడుగుల ఎత్తు ఉన్న మహానేత కటౌట్లు అభిమానులను అలరిస్తున్నాయి. జీవకళ ఉట్టిపడినట్లు ఉన్న వైఎస్‌ఆర్ కటౌట్లను చూస్తూ ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అభిమానులు ఇడుపులపాయ వైపు కదులుతున్నారు.

No comments:
Post a Comment