కరీంనగర్: మంథని నియోజకవర్గంలో చీకటి పాలనకు పుట్ట మధుపై మంత్రి శ్రీధరబాబు అనుచరుల దౌర్జన్యమే నిదర్శనమని వైఎస్ఆర్ సీపీ నేత ఆది శ్రీనివాస్ అన్నారు. రాజకీయ నేతలు ఏ గ్రామానికైనా వెళ్లే హక్కును కాలరాస్తూ దాడికి దిగడాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. పుట్ట మధు ఒక్కడు కాదని, వైఎస్ఆర్ సీపీ కేడర్ మొత్తం ఆయనకు అండగా నిలుస్తుందన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తుందన్నారు. షర్మిల పాదయాత్ర చారిత్రాత్మకమని, దేశంలో ఎవరూ చేయలేని విధంగా షర్మిల 3 వేల పాదయాత్ర చేయడం ప్రభంజనం సృష్టిస్తుందని చెప్పారు. పుట్ట మధుపై దాడిని నిరసిస్తూ ధర్మారంలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల ధర్నా నిర్వహించారు.
source:sakshi
source:sakshi
No comments:
Post a Comment