ఇడుపులపాయ : చీకట్లో చిదంబరంతో రహస్య ఒప్పందాలు చేసుకున్న చంద్రబాబునాయుడు కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్ జగన్ సోదరి షర్మిల ఆరోపించారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు ముందుగా ఆమె గురువారమిక్కడ మాట్లాడుతూ రాష్ట్రంలో మూడేళ్లుగా ప్రధాన ప్రతిపక్షం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ప్రజలు సమస్యలతో అల్లాడిపోతుంటే ప్రతిపక్షం చోద్యం చూస్తోందన్నారు. కిలో రెండు రూపాయల బియ్యం, మద్యపాన నిషేధంపై బాబు ప్రజలను మోసం చేశారని షర్మిల మండిపడ్డారు.
విద్యుత్ బిల్లులు చెల్లించలేని రైతులపై కేసులు పెట్టి జైల్లో పెట్టించారన్నారు. అవమాన భారంతో వందలమంది ఆత్మహత్యలు చేసుకున్నారని.... ఆపాపం చంద్రబాబుది కాదా అని షర్మిల ప్రశ్నించారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు అవిశ్వాసం పెట్టడం లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ పార్టీలు తప్పా మూడో పార్టీ ఉండకూడదని కుట్ర పన్నుతున్నారని, జగన్ ప్రజల మధ్య ఉంటున్నారనే జైల్లో పెట్టించారని షర్మిల అన్నారు.

No comments:
Post a Comment