హైదరాబాద్, 19 అక్టోబర్ 2012 : షర్మిల శుక్రవారం వైయస్‌ఆర్ జిల్లాలోని పలు గ్రామాల మీదుగా పాదయాత్ర చేయనున్నారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో వేంపల్లె శివారులోని రాజీవ్ నగర్ కాలనీ నుండి ప్రారంభమయ్యే రెండవ రోజు పాదయాత్ర మొదచ నందిపల్లె (3.5 కి.మీలు) చేరుకుంటుంది. అక్కడి నుండి 1.8 కిలోమీటర్ల దూరంలోని తాళ్లపల్లె మీదుగా సాగుతుంది. ఆ తర్వాత ముసల్‌రెడ్డిగారిపల్లె నుండి 1.2 కి.మీల దూరాన ఉన్న దుగ్గన్నగారిపల్లె దిశగా సాగుతుంది. దుగ్గన్నపల్లె నుండి 1.5 కి.మీ సాగి అమ్మయ్యగారిపల్లె చేరుకుంటుంది. అక్కడి నుండి 0.6 కి.మీ నడతి వి.కొత్తపల్లె మీదుగా 3 కిలోమీటర్ల దూరాన ఉన్న గొందిపల్లె క్రాస్ వైపునకు సాగుతుంది. అక్కడి నుండి మరో 1.5 కిలోమీటర్లు నడచి షర్మిల వేముల చేరుకుంటారు. వేముల నుండి 4.7 కిలోమీటర్లు సాగి భూమయ్యగారి పల్లె క్రాస్ వద్దకు నడుస్తారు. అక్కడే రెండో రోజు విశ్రాంతి. రెండో రోజు షర్మిల మొత్తం 19 కి.మీలు పాదయాత్ర చేస్తారు. షర్మిల యాత్రకు సంఘీభావం తెలపాలని వైఎస్‌ఆర్ సీపీ సమీపగ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
http://www.ysrcongress.com/news/news_updates/rendavaroju_padayatra_19_kilometarlu.html
http://www.ysrcongress.com/news/news_updates/rendavaroju_padayatra_19_kilometarlu.html
No comments:
Post a Comment