నా పేరు షర్మిల, రాజన్న కూతురిని అంటూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల పాదయాత్ర ప్రారంభోత్సవ సభలో ప్రసంగించి ప్రజలను ఆకట్టుకోవడానికి యత్నించారు. నల్లబాడ్జీ ధరించి ఆమె సబలో పాల్గొన్నారు.ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారని, ప్రతిపక్ష తెలుగుదేశం చోద్యం చూస్తోందని, ఆ సమస్యలను విస్మరించిందని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడు మామను వెన్నుపోటు పొడిచి అదికారంలోకి వచ్చారని అన్నారు. టిడిపి అధికారంలోకి రావడానికి రెండు రూపాయలకు కిలో బియ్యం , మద్యపాన నిషేదం నినాదాలు కారణమని, కాని చంద్రబాబు వాటిని వదలివేశారని అన్నారు. చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు కట్టలేని వారి ని జైలులో పెట్టారని,ఇళ్లలో సామాను కూడా లాక్కుపోయారని, దీని ఫలితంగా రైతులు ఆత్మహత్య లు చేసుకున్నారని, ఆ పాపం చంద్రబాబుది కాదా అని షర్మిల ప్రశ్నించారు. ఎల్లో డ్రామాకు తెరదీసి,చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడు అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టరని ఆమె అన్నారు. రెండు ముఖ్య ఉద్దేశ్యాలతో తాను పాదయాత్ర చేస్తున్నానని, అసమర్ద ప్రబుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ఒకటైతే , ఈ అసమర్ధ ప్రభుత్వాన్ని ఎండగట్టి అవిశ్వాస తీర్మానం ద్వారా ఎందుకు పడకొట్టడం లేదని అడగడం మరొకటని అన్నారు. చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి చిదంబరంను కలిసి తనపై కేసులు రాకుండా మేనేజ్ చేసుకుంటారని అన్నారు.రాష్ట్రంలో రెండే పార్టీలు ఉండాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని, అందుకే కుట్రలు చేస్తున్నారని అన్నారు.సుప్రింకోర్టు జడ్జి ఇచ్చే తీర్పును ప్రభావితం చేయడానికి ఇడి అటాచ్ మెంట్ నోటీసు ఇప్పించారని, ఇది తెలుగుదేశం ఎమ్.పిలు చిదంబరం ను కలిసి చేసిన పనే అని ఆమె ఆరోపించారు.కుట్ర రాజకీయానికి నిరసనగా ఈ మహా ప్రజా ప్రజా ప్రస్థానంలో పాల్గొంటున్న ప్రతి కార్యకర్త నల్ల బాడ్జీలు ధరించాలని అన్నారు. జగన్ తిరిగి వచ్చేవరకు ఈ నల్ల బాడ్జీలు దరిస్తామని ఆమె ప్రకటించారు.తాను జగన్ వదిలిన బాణాన్ని ఆమె ప్రకటించుకున్నారు. రాజశేఖరరెడ్డి కూతురిగా, జగనన్న చెల్లిలిగా,వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ సామాన్య కార్యకర్తగా, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ సైనికురాలిగా ఈ ప్రజా ప్రస్థానాన్ని ఆరంబిస్తున్నట్లు ప్రకటించారు. పాదయాత్రలో ప్రతిక్షణం తండ్రి రాజశేఖరరెడ్డిని,అన్న జగన్ ను తలచుకుంటానని , ప్రజా సమస్యలను గుర్తు ఉంచుకుంటానని ఆమె ప్రకటించారు.జగన్ సతీమణి భారతి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయమ్మ జెండా ఊపడంతో షర్మిల పాదయాత్ర ఆరంభమైంది.
source:kommineni
No comments:
Post a Comment