ఇడుపులపాయ : మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమైన షర్మిల గురువారం తండ్రి ఆశీస్సులు తీసుకున్నారు. ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్ వద్ద తల్లి వైఎస్ విజయమ్మ, వదిన వైఎస్ భారతితో కలిసి ఆమె తండ్రి సమాధి దగ్గర ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఉద్వేగభరిత వాతావరణంలో సాగిన ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు, కూడా పాల్గొన్నారు. అనంతరం ఘాట్ ప్రాంగణంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. పాదయాత్ర దిగ్విజయంగా సాగాలని ఆశీర్వదించిన వేద పండితులు షర్మిలకు కంకణధారణ చేశారు. ముస్లిం మతపెద్దలు ప్రార్థనలు జరిపి ఆశీర్వదించారు.
షర్మిల పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు వచ్చిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులతో ఇడుపులపాయ జనసంద్రమైంది. దారులన్నీ ఇడుపులపాయకే అన్నట్టుగా కనిపించాయి.
ఇడుపులపాయ : తండ్రికి తగ్గ తనయురాలిగా షర్మిల నడుచుకుంటున్నారని వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరి విమలమ్మ అభిప్రాయపడ్డారు. ఇడుపులపాయలోని మహానేత సమాధి వద్ద ఆమె నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విమలమ్మ మాట్లాడుతూ షర్మిల పాదయాత్ర నిర్ణయం సాహసోపేతమైందన్నారు. షర్మిల పాదయాత్ర సంపూర్ణంగా, విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ లాగే వారి బిడ్డలకు కూడా ప్రజల ప్రేమ, అభిమానం, అండదండలు ఉంటాయన్నారు.

No comments:
Post a Comment