అనంతపురం జిల్లాలో షర్మిల పాదయాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 23వ తేదీ నుంచి షర్మిల మరో ప్రజాప్రస్థానం యాత్ర నిర్వహించనున్నారు. దాడితోట దగ్గర షర్మిల అనంతపురం జిల్లాలో ప్రవేశిస్తారు. 14 రోజుల పాటు ధర్మవరం, రాప్తాడు, అనంతపురం, ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లో పాదయాత్ర జరగనుంది. మొత్తం 75 గ్రామాలు, పట్టణాల మీదుగా పాదయాత్ర జరిగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. qరాజన్న బిడ్డ కోసం జనం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని.. కనీవినీఎరుగని రీతిలో పాదయాత్ర జరగనుందని వైఎస్‌ఆర్ సిపి నేత శంకర నారాయణ చెప్పారు.
source:sakhi
source:sakhi
No comments:
Post a Comment