ఇడుపులపాయ : ప్రజలపై కొండంత నమ్మకంతో తన బిడ్డ షర్మిలను ప్రజా క్షేత్రంలోకి పంపుతున్నానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. షర్మిల పాదయాత్ర ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో ఇడుపులపాయ వేదికగా సాగిన బహిరంగ సభలో ఆమె గురువారం ఉద్వేగభరితంగా మాట్లాడారు.
జగన్ ను ఆదరించినట్లుగానే షర్మిలను కూడా అక్కున చేర్చుకోవాలని విజయమ్మ కోరారు. ఓ బిడ్డ జైలులో ఉంటే మరో బిడ్డను మీ ముందుకు పంపిస్తున్నానంటూ ఆమె భావోద్వేగంతో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా ప్రజల భరోసానే తమ కుటుంబానికి అండదండగా ఉన్నాయన్నారు. వైఎస్ ను ప్రేమించే ప్రతి హృదయానికి చేతులెత్తి నమస్కరిస్తున్నానని విజయమ్మ తెలిపారు. జగన్ కు బెయిల్ వస్తే షర్మిల చేపట్టిన పాదయాత్రను కొనసాగిస్తారని ఆమె చెప్పారు.

No comments:
Post a Comment