వేంపల్లె: సీబీఐని వాడుకుంటూ టీడీపీ, కాంగ్రెస్‌లు కలిసి జగన్‌ను జైళ్లో పెట్టాయని ఆయన సోదరి షర్మిల ఆరోపించారు. చంద్రబాబు, కాంగ్రెస్ కుమ్మక్కై ఇంకో పార్టీ రాకూడదని జగన్‌ను జైలుపాలు చేశాయని అన్నారు. జైళ్లో ఉండి కూడా జగన్ రాష్ట్ర ప్రజల గురించే ఆలోచిస్తున్నారని చెప్పారు. మరో ప్రజాప్రస్థానం పేరుతో ఇడుపులపాయ నుంచి ఆమె చేపట్టిన పాదయాత్ర గురువారం సాయంత్రం వేంపల్లె చేరుకుంది. ఈ సందర్భంగా తనను ఆశ్వీరదించేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. జగనన్న బయటఉంటే ఈ పాదయాత్రను ఆయనే చేసేవారన్నారు. కానీ ఈరోజు మన మధ్యకు రాలేని పరిస్థితి జగన్‌ది అని చెప్పారు. రాజన్న, జగనన్న ప్రజల మనుషులని అన్నారు. వారు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు రాజన్న కుటుంబం శిరస్సు వంచి నమస్కరిస్తోందన్నారు.
30 సంవత్సరాలు కాంగ్రెస్‌కు వైఎస్‌ఆర్ సేవలు చేశారని గుర్తు చేశారు. ఇంత విశ్వాసం చూపించిన వైఎస్‌ఆర్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. వ్యవసాయం దండగా అన్న వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. అన్నివిధాలా విఫలమైన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టకుండా టీడీపీ ఎందుకు కాపాడుతోందని షర్మిల సూటిగా ప్రశ్నించారు. జగనన్న నాయకత్వంతోనే రాజన్న రాజ్యం సాధ్యమన్నారు. ప్రతి అడుగులో నాన్నను, జగనన్నను తలుచుకుంటూ ముందుకు సాగుతానని చెప్పారు.
source:sakshi

No comments:
Post a Comment