తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేనేత కార్మికుల కోసం ఒకపూట ఉపవాస దీక్ష చేస్తాననడాన్ని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన ఆరోగ్యం బాగోలేక వైద్యుల సలహామేరకు ఉపవాసం చేస్తున్నారేతప్ప చేనేత కార్మికులకోసం కాదన్నారు. ఆయన శుక్రవారం గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ... తొమ్మిదేళ్లు సీఎంగా, తొమ్మిదేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్నన్నాళ్లూ గుర్తుకురాని చేనేత కార్మికులు బాబుకు ఇపుడు గుర్తుకొచ్చారా? అని ప్రశ్నించారు. బాబుకు కాలినొప్పి ఎక్కువైనట్లు పత్రికల్లో చూశానని, ఆ నొప్పితగ్గడానికి వైద్యులు చేసిన సూచనల్లో భాగంగానే ఉపవాసం చేస్తున్నట్లుగా ఉందని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో కాంగ్రెస్ చేర్పించదనడం సరికాదని చెప్పారు.
:sakshi
:sakshi
No comments:
Post a Comment