YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday, 19 October 2012

షర్మిల పాదయాత్ర రాజకీయాలలో ఒక సంచలనం


షర్మిల పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనం కానుందని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఇది ఒక చరిత్రాత్మక పాదయాత్ర అని ఆయన శుక్రవారం ఉదయం 'సాక్షి' టీవీలో జరిగిన ఒక చర్చాకార్యక్రమంలో వ్యాఖ్యానించారు.
''ఆనాడు చేవెళ్లలో వైయస్‌ చేసిన ప్రజాప్రస్థానం చూశాం. అప్పటి కన్నా కూడా షర్మిల పాదయాత్రకు ప్రజాదరణ ఎక్కువగా కనిపిస్తోంది. ఇడుపుల పాయలో నిన్న హాజరైన జనసంఖ్యను అంచనా వేయడం కూడా సాధ్యం కాదు. ఇంతగా ప్రజాదరణ రావడానికి కారణం కాంగ్రెస్‌, టిడిపిల కుమ్మక్కు రాజకీయాలు" అని రాంబాబు అన్నారు. ఆనాడు చంద్రబాబు పాలన తీరుతెన్నులకు విసిగి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు భరోసా ఇవ్వడానికి వైయస్ పాదయాత్ర చేశారు. కాగా చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలను తనవైపుకు మళ్లించుకోవడానికి ఇప్పుడు పాదయాత్ర తలపెట్టారు." అని ఆయన విశ్లేషించారు.
"విజయమ్మ ప్రసంగిస్తూ, రాజశేఖర్‌ రెడ్డి బిడ్డల్లో ఒకరు జైలులో ఉంటే, ఒకరు రోడ్డుపై ఉన్నారనీ వారిని ఆదరించండి అన్నారు. ఇవి మానవీయ స్పర్శ ఉన్నవారందర్నీ కదిలించే మాటలు" అని ఆయన వ్యాఖ్యానించారు. షర్మిల రాజకీయాల కోసం రావడం లేదనీ తాను కొన్ని ప్రత్యేకపరిస్థితుల వల్ల పాదయాత్ర చేస్తున్నానీ వివరించారన్నారు. నిజానికి ఈ యాత్ర జగన్మోహన్‌ రెడ్డి చేయాల్సిందనీ, తాను జగనన్న వదిలిన బాణాన్ని అని షర్మిల చెప్పడంలో ఉద్దేశ్యం ఇదేననీ రాంబాబు వివరించారు. ఎంతగా జగన్‌ను అణచడానికి యత్నిస్తిస్తే అంతగా ఎగసి పైకి లేస్తారన్నది  షర్మిల పాదయాత్రకు వచ్చిన జన ప్రభంజనంతో మరోసారి రుజువైందని ఆయన అన్నారు. షర్మిల ఏ హోదాలో పాదయాత్ర చేస్తున్నారన్న విమర్శకు బదులిస్తూ జనం దగ్గరకు వెళ్లడానికి హోదా ఎందుకండీ అని కొట్టిపారేశారు. "ఇదేమీ చంద్రబాబు యాత్రకు పోటీ కాదు, దీని పేరే మరో ప్రజాప్రస్థానం. రాజశేఖర్ రెడ్డి గారే పాదయాత్రతో రాజకీయాలను మలుపుతిప్పారు. షర్మిల పాదయాత్ర కూడా రాజకీయాలలో సంచలనం కాబోతుంది. తండ్రి పాదయాత్ర రికార్డును బద్దలు కొడుతుంది. కాంగ్రెస్, టిడిపిల కుట్రలను ఛేదించే దిశగా సాగుతుంది. ఆశీర్వదించండని తెలుగుప్రజలందర్నీ కోరుతున్నా" అని రాంబాబు విజ్ఞప్తి చేశారు.

నిద్ర నటిస్తున్న ఈ ప్రభుత్వాన్ని లేపుదాం: షర్మిల
రైతన్న కోసం నాన్న ఎప్పుడూ తపించేవారు.


వానలు వస్తున్నా విద్యుత్‌ లేదు. నిద్ర లేదు. రోడ్లు లేవు. ప్రజల జీవితం దుర్భరంగా మారిపోయింది. ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం నిద్ర నటిస్తోంది. నిద్రపోతున్నవారినన్నా లేపవచ్చు, కానీ నిద్ర నటిస్తున్నవారిని లేపలేం. మరో ప్రజాప్రస్థానం రెండవరోజు శుక్రవారం పాదయాత్ర ప్రారంభిస్తూ యాత్రలో పాల్గొన్న, యాత్రను చూసేందుకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల మాట్లాడారు. వైయస్‌ఆర్ జిల్లా వేంపల్లె శివారులోని రాజీవ్‌నగర్ కాలనీ నుంచి ప్రారంభించారు. షర్మిల పాదయాత్రకు స్వాగతం పలికేందుకు ప్రజలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

‌దివంగత మహానేత, తన తండ్రి డాక్లర్ వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నా, లేకున్నా ‌నిరంతరమూ రైతుల సంక్షేమం కోసమే ఆలోచించేవారని షర్మిల పేర్కొన్నారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవటం వల్లే రాష్ట్రంలో విద్యుత్ కొరత సమస్య ముప్పుగా పరిణమించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో అస్సలు విద్యుత్తే ఉండని పరిస్థితి నెలకొన్నదని ఆమె విచారం వ్యక్తం చేశారు. విద్యుత్‌ సమస్య కారణంగా ప్రజలు కనీసం కంటినిండా నిద్రపోయే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్, ‌టిడిపిలను నమ్ముకుంటే మనల్ని నట్టేట ముంచుతాయని షర్మిల హెచ్చరించారు. మన కష్టాలు తీర్చి, కన్నీళ్ళు తుడిచే రాజన్న రాజ్యం వస్తేనే విరుగుడు లభిస్తుందని తెలిపారు. జగనన్న సారథ్యంలో రాజన్న రాజ్యం తప్పకుండా వస్తుందని భరోసా ఇచ్చారు. రాజన్న రాజ్యం కావాలంటే జగనన్నను ఆశీర్వదించండి. అందరూ కుట్ర పన్ని జగనన్నను జైలు పాలు చేశారు. సమయం వచ్చినప్పుడు వారికి బుద్ధిచెప్పండి అని షర్మిల పిలుపునిచ్చారు.
నందిపల్లెలో విద్యార్థులను కలిసిన ఆమె వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు షర్మిల బస చేసిన ప్రాంతం జనంతో కళకళలాడింది.

http://www.ysrcongress.com/news/news_updates/sharmila_padayatra_rajakeeyalalo_oka_sanchalanam.html

1 comment:

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!