అనంతపురం, న్యూస్‌లైన్: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆగస్టు 15వ తేదీ చరిత్రలో ఎంతటి ప్రాముఖ్యతను సంపాదించుకుందో అంతే ప్రాధాన్యతను దేశ రాజకీయాల్లో అక్టోబర్ 18 కూడా సంపాదించుకోబోతోందని తిరుపతి ఎమ్మెల్యే, ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర కన్వీనర్ భూమన కరుణాకరరెడ్డి అన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల గురువారం ఇడుపులపాయ నుంచి ప్రారంభించనున్న పాదయాత్రకు జిల్లాలో చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించేందుకు బుధవారం స్థానిక వీకే మెమోరియల్ హాలులో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ శంకరనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి కరుణాకరరెడ్డితో పాటు పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి, అనంతపురం, రాయదుర్గం ఎమ్మెల్యేలు బి.గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, సీఈసీ సభ్యులు విశ్వేశ్వర రెడ్డి, పైలా నర్సింహయ్య, సీజీసీ సభ్యురాలు తోపుదుర్తి కవిత, గుంతకల్లు నియోజకవర్గ ఇన్‌చార్జ్ వై.వెంకటరామిరెడ్డి తదితరులు హాజరయ్యారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబుకు ప్రపంచంలోనే ఎవరూ సాటిలేరని భూమా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు.

No comments:
Post a Comment