వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి మళ్లీ వసలలు ఆరంభం అయ్యేలా ఉంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎమ్.రాజేష్ కుమార్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో కి రావడానికి రంగం సిద్దం చేసుకున్నారు. చింతలపూడిలో కాంగ్రెస్ క్యాడర్ అంతా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వైపు వెళ్లడంతో తనకు ఆ పార్టీలోకి వెళ్లక తప్పదని ఆయన బావిస్తున్నారు. అదీకాక ఆ ప్రాంతంలో నాయకుడుగా ఉన్న కరాటం బాబూరావు ఇప్పటికే వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి రావడంతో రాజేశ్ కూడా దీనిపై నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. కాగా గతంలోనే ఈయన ఈ పార్టీలోకి రావాలని భావించినా, కొన్ని కారణాల వల్ల ఆగిపోయారు.రాజేశ్ ను వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎప్పుడు రాజీనామా ప్రకటన చేయమంటే అప్పుడు ప్రకటన చేయవచ్చు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్.పి ఇంద్ర కిరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు కూడా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఇక జగన్ పార్టీలో చేరడమే తరువాయి. http://kommineni.info/articles/dailyarticles/content_20121019_4.php |
Thursday, 18 October 2012
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి చింతలపూడి ఎమ్మెల్యే!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment