కడప జిల్లా ఇడుపలపాయలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అదినేత జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర ప్రారంబోత్సవ సభకు పెద్ద ఎత్తున జనసందోహం తరలివచ్చారు.. విజయమ్మ ప్రసంగిస్తూ షర్మిలను ఎందుకు పాదయాత్రకు పంపుతున్నది వివరించారు. ఈ ప్రభుత్వంలో ప్రజలకు ఏమి జరగడం లేదని చెప్పడానికి,ప్రజలకు అండగా ఉండడానికి షర్మిల జనంలోకి వస్తున్నారని అన్నారు.ఒక దశలో విజయమ్మ స్వరం కొంత ఆవేదన కనిపించింది.జనంలో నెలకు ఇరవై ఐదు రోజులు ఉంటున్న జగన్ కావాలని జైలులో పెట్టారని ఆమె ఆరోపించారు.జగన్ ను ప్రజలంతా అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా అక్కున చేర్చుకున్నారని ఆమె అన్నారు.కడప జిల్లా ప్రజలు, ముఖ్యంగా పులివెందుల ప్రజలు తమను ఆదరిస్తున్న తీరును ఆమె గుర్తు చేసుకున్నారు.జగన్ జైలులో ఉన్నా జనం కోసమే ఆలోచిస్తున్నారని అన్నారు.బెయిల్ ఇస్తే జగన్ పాదయాత్ర చేయాలని భావించారని, కాని బెయిల్ రాలేదని,అందువల్ల ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకూడదని భావించి తమను జనంలో ఉండాలని కోరారన్నారు. తనను యాత్ర చేయవలసిందిగా జగన్ కోరారని, కాని తాను చేయగలనా అని సందేహం వ్యక్తం చేస్తే, అక్కడ షర్మిల తాను పాదయాత్ర చేస్తానని ముందుకు వచ్చారని అన్నారు.ఈ పాదయాత్ర జగన్ వచ్చేవరకు షర్మిల కొనసాగిస్తారని అన్నారు.చంద్రబాబు అన్ని దొంగ మాటలు చెబుతున్నారని కూడా ఆమె విమర్శించారు.
source: kommineni
No comments:
Post a Comment