వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జెడ్ క్యాటగిరీ ఉన్న నేతను అవమానించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. రాజకీయ ఖైదీగా ప్రత్యేక ఏర్పాట్లు కల్పించిన జగన్‌ను సాధారణ వాహనంలో తీసుకెళ్లడం ఎంత వరకు న్యాయమని ఆమె ప్రశ్నించారు.
ఈఘటనతో పాటు ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తుంటే జగన్‌పై కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పూరితంగా ఆయన్ను అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను మానసికంగా దెబ్బతీసేందుకు ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. వ్యక్తిగత భద్రత ఉన్న ఆయన్ను పటిష్టమైన సెక్యూరిటీ మధ్య ప్రత్యేక వాహనంలో తరలించాల్సి ఉండగా ఇటువంటి చర్యకు పాల్పడటం ఎంతవరకూ సబబని ఆపార్టీ నేతలు ప్రశ్నించారు.

No comments:
Post a Comment