పిట్టలదొర వేషాలు, కాకి లెక్కలు మానుకోవాలని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జలీల్ ఖాన్ హితవుపలికారు. యువనేత జగన్ కు ఉన్నది సానుభూతి కాదని ప్రజాదరణ అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు 2009 ఎన్నికల కంటే 30 శాతం అధికంగా ఓట్లు తెచ్చుకున్నారని తెలిపారు. సోనియా బొమ్మతో తిరిగిన కాంగ్రెస్ కు రెండు సీట్లే వచ్చాయని ఆయన ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలు రెఫరెండం కాదన్న లగడపాటి ఇప్పడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment