లాస్ఏంజిల్స్: వైఎస్ఆర్ వర్ధంతిని అమెరికాలోని వైఎస్ఆర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. లాస్ఏంజిల్స్ నగరంలో వందలాదిమంది అభాగ్యులకు భోజనం పెట్టారు. ఈ కార్యక్రమం వైఎస్ఆర్ ఫ్యాన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగింది. లాజ్ ఏంజిల్స్ మిషన్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో 15 వందల మందికి పైగా భోజనం చేశారని అమెరికాలోని వైఎస్ఆర్ ఫ్యాన్ క్లబ్ అధ్యక్షుడు వీరారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వైఎస్ఆర్ అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దక్షిణ కాలిఫోర్నియా తెలుగు అసోషియేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు, నాటా సలహా మండలి సభ్యుడు ధర్మారెడ్డి, రాజకేశిరెడ్డి, మల్లిక్, సుధీర్ ఓబులమ్, వీరబాబు తదితరులు వైఎస్ఆర్ స్మారక సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment