నల్గొండ జిల్లా భువనగిరిలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆ పార్టీలో చేరతానని యువతెలంగాణ జేఏసీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ప్రకటించారు. లోటస్ పాండ్‌లో ఈరోజు ఆయన విజయమ్మను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 29న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు వెల్లడించారు. తెలంగాణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన నిబ్బద్ధతతో ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కొన్ని పార్టీలు కుటుంబ రాజకీయాలకు వాడుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment