ప్రభుత్వ, ప్రతిపక్షాల వ్యవహారశైలికి నిరసన తెలుపుతూ షర్మిల పాదయాత్ర సాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి చెప్పారు. ఆమె నల్లబ్యాడ్జీతోనే పాదయాత్ర చేస్తారన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. షర్మిల పాదయాత్రకు హంగులు ఆర్భాటాలు ఉండవని చెప్పారు. ఆమె పాదయాత్ర ఆరు నెలల పాటు మూడు వేల కిలో మీటర్లు సాగుతుందని వివరించారు.
తమ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి లభించే ప్రజాధరణకు భయపడి టిడిపి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయిందని విమర్శించారు. అవిశ్వాసం తీర్మానం ప్రవేశ పెట్టకుండా పేరుకే ప్రతిపక్షంగా టిడిపి ఉందన్నారు. వైఎస్‌ఆర్ సీపీని ఎదుర్కోవడానికి ఆ పార్టీ కాంగ్రెస్‌తో సయ్యాటలు ఆడుతూ ప్రజాకంటకంగా మారిందన్నారు. అధికార, ప్రతిపక్షాల వైఖరికి నిరసనగానే షర్మిల పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన వివరించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖ రెడ్డి హయాంలో సువర్ణ యుగాన్ని తిరిగి పేదలకు అందించేందుకే ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. తెలుగుజాతి యావత్తూ ఈ యాత్ర కోసం ఎదురుచూస్తోందని ఆయన అన్నారు.

No comments:
Post a Comment