ఇక ప్రభుత్వం కూడా మద్యం వ్యాపారంలోకి అడుగు పెట్టనుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం షాపులు నిర్వహించాలని సర్కార్ నిర్ణయించారు. కొత్త మద్యం పాలసీ విధానానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆమోదం తెలపటంతో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇవాళ విడుదల చేయనున్నారు.
వేలం పాటల పద్ధతిపై తీవ్ర విమర్శలు రావడంతో ఫిక్స్‌డ్ లైసెన్స్ విధానం వైపు ప్రభుత్వం మెగ్గుచూపింది. లాటరీ పద్ధతి ద్వారా మద్యం షాపులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉన్న 7,600 మద్యం షాపులకు అదనంగా మరో 700 షాపులను మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయించే పద్ధతిని అరికట్టేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొన్ని షాపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సిఎం ఆమోదం తెలపటంతో రాష్ట్రంలో కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది.

No comments:
Post a Comment