మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్రపాలక మండలి సభ్యులు కొణతాల రామకృష్ణ, సోమయాజులు డిమాండ్ చేశారు. వైఎస్ మరణం ప్రమాదమా లేక కుట్రపూరితమా అనే అనుమానం ప్రతిఒక్కరిలో ఉందన్నారు. వైఎస్.మరణాన్ని రాజకీయ లబ్ధికోసం వాడుకోవాల్సిన అవసరం వైఎస్‌ఆర్ సీపీకి లేదని కొణతాల స్పష్టం చేశారు. సీబీఐ హాడావుడిగా దర్యాప్తు ముగించిందని ప్రతిఒక్కరు అనుకుంటున్నారన్నారు. వైఎస్‌ఆర్ సువర్ణయుగం మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొణతాల, సోమయాజులు అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment