తిరుపతి: రాష్ట్ర రాజకీయాల్లో పదిరోజుల్లో పెనుమార్పులు జరుగుతాయని మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వైఎస్ పథకాలకు కిరణ్ సర్కార్ తూట్లు పొడుస్తోందని ఆయన సోమవారమిక్కడ విమర్శించారు. ముఖ్యమంత్రిని మార్చితేనే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుందని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లాకు కిరణ్ కుమార్ రెడ్డి చేసింది శూన్యమని ఆయన అన్నారు. తన రాజకీయ భవిష్యత్ పై పది రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని పెద్దిరెడ్డి తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment