ఇడుపులపాయ(వైఎస్సార్ జిల్లా), న్యూస్‌లైన్: మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి మూడవ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ జనసంద్రమైంది. ఆదివారం ఉదయం 7 గంటలకే వైఎస్ కుటుంబ సభ్యులు వైఎస్సార్ ఘాట్ చేరుకున్నారు. కన్నీటి నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మహానేత సతీమణి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వై.ఎస్.భారతీరెడ్డి, కుమార్తె షర్మిల, మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి, బ్రదర్ అనిల్, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి, శివరామిరెడ్డి, వైఎస్ కొండారెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, కమలమ్మ, రాజమ్మ, ఇ.సి.గంగిరెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు మహానేతకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులతో వైఎస్సార్ ఘాట్ పోటెత్తింది. వైఎస్సార్ అమర్ రహే.. జై జగన్.. కాబోయే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పెద్దాయన చేసిన మేళ్లను గుర్తుచేసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు. మహానేత వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్ సమీపంలో వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Sunday, 2 September 2012
జనసంద్రమైన ఇడుపులపాయ

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment