తెలుగుదేశం అదినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న పాదయాత్రకు తమ మద్దతు ఉండదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు స్పష్టం చేశారు. సిపిఐ నాయకులు స్థానికంగా చంద్రబాబు యాత్రకు సంఘీభావం ప్రకటిస్తుండగా రాఘవులు మాత్రం తమ మద్దతు ఉండదని ఆయన పేర్కొనడం విశేషం.చంద్రబాబు తమ పార్టీ విదానాలను ప్రచారం చేసుకునేందుకు పాదయాత్ర చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో సిపిఎం ఒంటరిగా పోటీచేస్తుందని కూడా ఆయన చెప్పారు.తెలంగాణ సమస్య కు కారణం కాంగ్రెస్ పార్టీ అని, ఆ పార్టీనే దానిని పరిష్కరించాలని కూడా ఆయన అన్నారు. పార్లమెంటులో తెలంగాణపై చర్చను పెట్టాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. మొత్తం మీద వామపక్షాలు అయినా సిపిఐ , సిపిఎం దారులు వేరని ఆయన చెప్పకనే చెప్పినట్లు .
http://kommineni.info/articles/dailyarticles/content_20121017_5.php
No comments:
Post a Comment