నల్గొండ: జెండా మోసి పనిచేసిన కార్యకర్తలకు టీడీపీలో విలువ ఉండదని, పార్టీలు మారుతూ వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తారని మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబువి పూర్తి అవకాశవాద రాజకీయాలని విమర్శించారు. ఇచ్చిన ఏ హామీనీ ఆయన నిలబెట్టుకోలేదన్నారు. విశ్వసనీయతలేని చంద్రబాబు పార్టీలో పనిచేసేకంటే విశ్వసనీయత ఉన్న వైఎస్‌ఆర్ సీపీలో పనిచేయడం ఉత్తమం అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=470652&Categoryid=14&subcatid=0
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=470652&Categoryid=14&subcatid=0
No comments:
Post a Comment