అనంతపురం, న్యూస్‌లైన్‌ప్రతినిధి:వస్తున్నా.. మీ కోసం’ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 2న చేపట్టిన పాదయాత్ర ఆదివారం అనంతపురం జిల్లాలో ముగిసి కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. 13 రోజుల్లో అనంతపురం జిల్లాలో మొత్తం 226.4 కిలోమీటర్ల మేర ఆయన నడిచారు. టీడీపీ ఉనికి చాటిచెప్పడానికి, శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి సమీకరించడానికి, ముఠా తగాదాల్లో కొట్టుమిట్టాడుతోన్న శ్రేణులను సమైక్యపరచి ఎన్నికలకు సమాయత్తంచేయడానికి చేపట్టిన ఈ యాత్ర తొలి జిల్లాలో ముగిసిన నేపథ్యంలో యాత్ర ఆశించిన లక్ష్యాన్ని చేరుకుందా? అని అంటే.. ఆ పార్టీ శ్రేణులే పెదవి విరుస్తున్నాయి. పాదయాత్ర వల్ల జిల్లాలో టీడీపీకి ఏమీ ఒనగూరకపోగా.. తగాదాలు తీవ్రమయ్యాయని అంటున్నాయి. యాత్రలో బాగా ముఖ్యమనుకున్న ప్రాంతాల్లో టీడీపీ నేతలు జనాన్ని బాగానే సమీకరించినా.. మిగతా చోట్ల, యాత్ర మార్గాల్లో ఆ మేరకు జనం కనిపించకపోవడం శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఏడు నియోజకవర్గాల్లో యాత్ర సాగితే అందులో నాలుగు నియోజకవర్గాలకు టీడీపీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినప్పటికీ ఏడు నియోజకవర్గాల్లోనూ యాత్రకు జన స్పందన లేకపోగా.. ముఠా తగాదాలు మరింత పెరిగాయని అంటున్నారు. అధినేత ఆదేశాల మేరకు నకిలీ మద్యం తయారు చేసి, పాదయాత్రకు సరఫరా చేసే బాధ్యతను టీడీపీకి చెందిన ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు కొత్తచెరువుకు చెందిన ఆ పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి సాలక్కగారి శ్రీనివాసులుకు అప్పగించారు. టీడీపీలో వర్గ విభేదాల వల్ల సాలక్కగారి శ్రీనివాసులు బాగోతాన్ని ఎక్సైజ్ అధికారులు రట్టు చేశారు. మరోవైపు హిందూపురం ఎమ్మెల్యే అబ్దుల్‌ఘనీపై ఆపార్టీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్యే పామిశెట్టి రంగనాయకులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. పెనుకొండ, రాప్తాడు నియోజకవర్గాల్లో బీకే పార్థసారథి, పరిటాల సునీత మధ్య నెలకొన్న విభేదాలను పాదయాత్ర మరోసారి బహిర్గతం చేసింది. కళ్యాణదుర్గంలోనూ అదే కథ. ఇక రాయదుర్గం నియోజకవర్గంలో చంద్రబాబు ఎదుటే ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి, దీపక్‌రెడ్డిల వర్గీయులు ఢీ అంటే ఢీ అనే స్థాయిలో తలపడ్డారు. గుంతకల్లులోనూ కేసీ నారాయణస్వామి, సాయినాథ్‌గౌడ్ వర్గీయులు ఒకరిపై ఒకరు వ్యంగాస్త్రాలను రువ్వుకున్నారు. జిల్లాలో పాదయాత్ర సాగుతున్న సమయంలోనే ఆ పార్టీ నేతలు ఇతర పార్టీలకు వలసబాట పట్టారు. రామగిరి సింగిల్ విండో అధ్యక్షుడు కురబ రామాంజనేయులు వైఎస్సార్ సీపీలో చేరారు. సోమందేపల్లిలో సీనియర్ ఈశ్వరయ్య అదే బాట పట్టారు. వందలాది మంది నేతలు, కార్యకర్తలు కూడా అదే బాట ఎంచుకున్నారు.
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=468945&Categoryid=1&subcatid=33

No comments:
Post a Comment