వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్సైట్ను పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం ఆవిష్కరించారు. పార్టీ కార్యాలయంలో www.ysrcongress.com ను ఆమె ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ డాట్ కామ్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ వెబ్సైట్లో పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలు పొందుపరిచారు.
తెలుగులో ఏర్పాటు చేసిన ఈ వెబ్‌సైట్ ద్వారా 'ఆన్‌లైన్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ'లో చేరవచ్చు. రాష్ట్రంలో కొత్త పార్టీని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందో ఈ వెబ్‌సైట్‌లో సమగ్ర కథనాన్ని పొందుపరించారు. పార్టీకి, ప్రజలకు అనుసంధానంగా ఈ వెబ్ సైట్ నిలుస్తుందని వైఎస్ విజయమ్మ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ అభిమానులకు ఈ సైట్ ప్రయోజనకారిగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు ఎస్ రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, బాజీరెడ్డి గోవర్థన్, చల్లా మధుసూధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment