టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర ఆలూరు నుంచి ఆదోని వైపు సాగుతోంది. చంద్రబాబు కన్నా వంద మీటర్ల ముందే కొందరు నాయకులు, కార్యకర్తలు నడుస్తున్నారు. దారిలో ఓ పత్తి చేను కనిపించింది. అక్కడో రైతు ఉన్నాడు. వెంటనే కొందరు అతని దగ్గరకి వెళ్లారు. ఆ రైతుకు శిక్షణనిచ్చి.. షో రక్తి కట్టించే డ్రామాకు తెరతీశారు. ఆ సీన్ ఇలా..
‘ఓ అన్నా! అదిగో చంద్రబాబు వస్తున్నాడు. మీ పత్తి చేన్లోకే తీసుకొస్తాం. ముందు నువ్వు ఇలా తలపాగా కట్టుకోవాలి. ఆయన చేన్లోకి వచ్చేయగానే ఇదిగో ఈ చెట్టు(పత్తిమొక్క)ను ఇలా... పీకాలి. వర్షాలు లేవు. మందుల ధరలు పెరిగినయి. ఇంకా పువ్వు కూడా రాలేదు. పత్తి ధర ఉండటం లేదు. ఎట్ట బతికేదో..! అని బాధపడుతూ చెప్పాలె. పేపరోళ్లు, టీవీలోళ్లు వస్తరు. రేపు నీ ఫొటోనే పేపర్లో వస్తది. సరేనా!’ అని స్థానిక నాయకులు ఆ రైతుకు డెరైక్షన్ ఇచ్చారు.
ఇలా చంద్రబాబు వచ్చారు..‘‘ ఏమయ్యా! పంట ఎలా ఉంది?’’ అని అడిగారు. రైతు పత్తి మొక్కను పీకి బాబుకు చూపిస్తూ..‘కష్టంగా ఉన్నది సార్. కరెంటు ఉండట్లేదు.. మీరే ఏదైనా చేయాలి’ అన్నాడు. ‘ఈ కష్టాలన్నిటికీ కారణం కాంగ్రెస్సే. మేం అధికారంలోకి రాగానే 9 గంటల కరెంటు ఇస్తాం’ అని బాబు వెళ్లిపోయారు. బాబు వెళ్లాక చూస్తే పచ్చని పత్తిపంటను తొక్కి నాశనం చేసిన గుర్తులే మిగిలాయి ఆ రైతుకు.

No comments:
Post a Comment